Hyper Aadi : యాంకర్ రష్మీ కోరికలు మామూలుగా లేవు.. పరువుతీసిన హైపర్ ఆది, రాం ప్రసాద్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : యాంకర్ రష్మీ కోరికలు మామూలుగా లేవు.. పరువుతీసిన హైపర్ ఆది, రాం ప్రసాద్‌

Hyper Aadi : శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఇప్పుడు అంతా కూడా హైపర్ ఆది, రాం ప్రసాద్‌ల హవానే సాగుతోంది. ఈ ఇద్దరూ పంచులు, ఆటో పంచులతో ఆడేసుకుంటున్నారు. ఇక కొత్తగా వచ్చిన రష్మీని మాత్రం తెగ టీజ్ చేసేస్తున్నారు. మాట్లాడితే ఆమె యాంకరింగ్ మీద సెటైర్లు పడుతున్నాయి. ఇక సుధీర్ పేరు ఎత్తకుండానే బాబు అంటూ రష్మీ నోరు మూయించేస్తున్నారు ఆది, రాం ప్రసాద్‌లు. మొత్తానికి తాజాగా ఎపిసోడ్‌లో రష్మీని ఆడేసుకున్నారు. ఎంట్రీలోనే రష్మీకి పంచుల […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 July 2022,12:30 pm

Hyper Aadi : శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఇప్పుడు అంతా కూడా హైపర్ ఆది, రాం ప్రసాద్‌ల హవానే సాగుతోంది. ఈ ఇద్దరూ పంచులు, ఆటో పంచులతో ఆడేసుకుంటున్నారు. ఇక కొత్తగా వచ్చిన రష్మీని మాత్రం తెగ టీజ్ చేసేస్తున్నారు. మాట్లాడితే ఆమె యాంకరింగ్ మీద సెటైర్లు పడుతున్నాయి. ఇక సుధీర్ పేరు ఎత్తకుండానే బాబు అంటూ రష్మీ నోరు మూయించేస్తున్నారు ఆది, రాం ప్రసాద్‌లు. మొత్తానికి తాజాగా ఎపిసోడ్‌లో రష్మీని ఆడేసుకున్నారు. ఎంట్రీలోనే రష్మీకి పంచుల మీద పంచులు పడ్డాయి.

పని లేనోళ్లిద్దరూ వచ్చారు అని ఆది, రాం ప్రసాద్‌ను అంటుంది రష్మీ. అవును మరి మీరు ఎందుకు వచ్చారు అని రష్మీ, ప్రగతి మీద కౌంటర్లు వేస్తాడు ఆది. శ్రీదేవీ డ్రామా కంపెనీ కాలెండర్‌ను చేతిలో పట్టుకుని రష్మీ ఉంటుంది. ఇదేంటో తెలుసా? అని రష్మీ అడుగుతుంది.. ఏంటది.. బాబుకి నీకు విడాకులు నోటీసా? అని ఆది అనడంతో రష్మీ షాక్ అవుతుంది. అలా ప్రతీ సందర్భంలో రష్మీ మీద పంచ్‌లు వేస్తూనే వచ్చారు.

Hyper Aadi And Ram Prasad Satires on Rashmi Gautam Anchoring

Hyper Aadi And Ram Prasad Satires on Rashmi Gautam Anchoring

ఇక ఎపిసోడ్ మధ్యలో రష్మీ తన కోరికను బయటపెట్టేసింది. వెయ్యి ఎపిసోడ్‌లకు తానే యాంకర్‌గా ఉంటానని, అట్లుంటది మనతోని అంటూ రష్మీ రెచ్చిపోయింది. అంతలేదులే.. ఇంకో నాలుగైదు ఎపిసోడ్‌లే అన్నట్టుగా ఆది, రాం ప్రసాద్‌లు కౌంటర్లు వేస్తారు. మొత్తానికి ఈ షోలో మాత్రం రష్మీ బాగానే సింక్ అయింది. సుధీర్ పేరుని పరోక్షంగా వాడేసుకుంటూ.. రష్మీని ఆడేసుకుంటున్నారు ఆది, రాం ప్రసాద్. రష్మీ సైతం ఆది, రాం ప్రసాద్‌ల సెటైర్లను ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తొంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది