Hyper Aadi : హైపర్ ఆది, సద్దాం మధ్య గొడవ ఏంటీ.. అందుకే జబర్దస్త్‌ కి సద్దాం గుడ్ బై..??

 Authored By prabhas | The Telugu News | Updated on :30 December 2022,6:00 pm

Hyper Aadi : జబర్దస్త్‌ ప్రారంభం అయ్యి పదేళ్లు కాబోతుంది. ఈ పదేళ్లలో ఎంతో మంది కమెడియన్స్ వచ్చారు.. పోయారు. అందులో ఒక పది మంది మాత్రం ఎప్పటికి గుర్తుండి పోతారు. జబర్దస్త్‌ పేరు చెప్పగానే చమ్మక్ చంద్ర పేరు ఎలా అయితే గుర్తుకు వస్తుందో అదే స్థాయిలో హైపర్ ఆది పేరు కూడా గుర్తుకు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోలకు దక్కే స్థాయిలో జబర్దస్త్‌ స్టార్ కమెడియన్స్ కు దక్కుతుంది. హైపర్‌ ఆది కి దక్కిన స్టార్‌ డమ్ అంతా ఇంతా కాదు. ఆయన గొప్ప కమెడియన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆయన జబర్దస్త్‌ కు గుడ్‌ బై చెప్పాడు.

ఆది ఇది వరకు ఒక సారి జబర్దస్త్‌ నుండి వెళ్లి పోయాడు. అయితే అప్పుడు తిరిగి వచ్చి అందరిని ఆశ్చర్యపర్చాడు. తాజాగా మళ్లీ జబర్దస్త్‌ కు గుడ్ బై చెప్పాడు. కానీ ఈసారి తిరిగి వచ్చే అవకాశాలు అసలు కనిపించడం లేదు. అందుకు కారణం సద్దాం మరియు యాదమరాజు ఎంట్రీ ఇవ్వడం అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యాదమరాజు తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆదికి సద్దాంతో మాత్రం గొడవలు ఉన్నాయట. గత కొంత కాలంగా ఈ విషయమై ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆది స్వయంగా ఆ విషయాన్ని వెళ్లడించాడు. కొత్త సంవత్సరం సందర్భంగా మల్లె మాల వారు ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో

Hyper Aadi and saddam fighting about jabardasth show

Hyper Aadi and saddam fighting about jabardasth show

ఆది ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ ఏడాది కొన్ని కారణాల వల్ల సద్దాంతో గొడవలు వచ్చాయి. ఇప్పుడు ఆ గొడవలు తగ్గి వచ్చే ఏడాదిలో కలిసి పోవాలని కోరుకుంటున్నాం అంటూ కేక్‌ తినిపించాడు. ఆ గొడవ ఏంటీ అనేది చూపించలేదు కానీ ఇద్దరి మధ్య గొడవ కారణంగానే జబర్దస్త్‌ లో ఒక్కరే ఉన్నారు.. ఆది పోయాడు అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. ఆది లేని లోటును కచ్చితంగా సద్దాం తీర్చుతాడు అని మల్లెమాల వారు నమ్ముతున్నారు. అయితే ఇద్దరు కలిసి స్కిట్‌ చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి