Hyper Aadi : ఇంత దారుణమా.. స్టేజ్ మీదే హైపర్ ఆదిపై దాడి చేసి గుండు కొట్టించి తీవ్రంగా అవమానించారు
Hyper Aadi : హైపర్ ఆది గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే బుల్లితెర మీద టాప్ కమెడియన్ తను. తనను తెలుగు బుల్లితెర మీద ఢీకొట్టేవాడే లేడు. జబర్దస్త్ కామెడీ షోకు, శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు అంత క్రేజ్ వచ్చిందంటే దానికి ప్రధాన కారణం హైపర్ ఆది. ఆయన వేసే పంచులకు జడ్జిలు అయితే నవ్వలేక చచ్చిపోతారు. పంచ్ వెనుక పంచ్.. ఇలా వరుసగా పంచ్ లు వేస్తూ హైపర్ ఆది చేసే రచ్చ మామూలుగా ఉండదు. హైపర్ ఆదితో స్కిట్ చేసేవాళ్లు కూడా ఆయనతో సమానంగా పంచ్ లు వేయలేకపోతారు. స్కిట్ మొత్తాన్ని తన భుజాల మీద మోసి ఆ 10 నిమిషాలు కడుపుబ్బా నవ్విస్తాడు హైపర్ ఆది.
అయితే.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆదికి అవమానం జరిగింది. నిజానికి ఈషోకు ఒకప్పుడు సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఉండేవాడు. కానీ.. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి సుధీర్ తప్పుకున్నాక.. రష్మీ గౌతమ్ ఆయన ప్లేస్ లోకి వచ్చింది. అయితే.. హైపర్ ఆది కూడా ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాడు. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ హైపర్ ఆది వేసే పంచులు మామూలుగా ఉండవు. అయితే.. లేటెస్ట్ ఎపిసోడ్ లో ఒక అనుకోని ఘటన చోటు చేసుకుంది. యాంకర్ రష్మీ పెట్టిన ఓ ఫన్నీ గేమ్ లో హైపర్ ఆది బుక్కయిపోయాడు. ఆ ఫన్నీ గేమ్ లో స్క్రీన్ పై కనిపించే నెంబర్లలో ఒక నెంబర్ ఎంచుకోవాలి. ఆ నెంబర్ వెనుక ఏ పని ఉంటే ఆ పని చేయాల్సి ఉంటుంది.
Hyper Aadi : గేమ్ లో బుక్ అయిపోయి స్టేజ్ మీదే గుండు కొట్టించుకున్న ఆది
ఫస్ట్ గేమ్ ఆడేందుకు హైపర్ ఆది వస్తాడు. 9 నెంబర్ ను ఎంచుకుంటాడు. దాని వెనుక నీకు నచ్చిన వాళ్లను 30 సెకన్ల పాటు ముద్దు పెట్టుకోవచ్చు అని రాసి ఉంటుంది. దీంతో తన స్కిట్ లో కంటెస్టెంట్ గా చేసే ఐశ్వర్యను పిలుస్తాడు ఆది. ఐశ్వర్యను ముద్దు పెట్టుకోవడానికి పొట్టి నరేష్ ఒప్పుకోడు. దీంతో చేసేది లేక.. నెంబర్ 11 ను సెలెక్ట్ చేసుకుంటాడు. దాని వెనుక గుండు చేయించుకోవాలి అని రాసి ఉంటుంది. దీంతో అక్కడ ఉన్న ఇతర కంటెస్టెంట్లు వెంటనే హైపర్ ఆదిని లాక్కెళ్లి మరీ.. స్టేజ్ మీదనే గుండు కొడతారు. జడ్జి ఇంద్రజ వద్దులే అన్నా కూడా బుల్లెట్ భాస్కర్ ఆవేశంతో గుండు కొట్టేస్తాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే లేటెస్ట్ ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.