Hyper Aadi : జానీ మాస్టర్ కారెక్టర్‌ మీద కామెంట్లు.. ఇక వదలడు అంటూ హైపర్ ఆది రచ్చ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : జానీ మాస్టర్ కారెక్టర్‌ మీద కామెంట్లు.. ఇక వదలడు అంటూ హైపర్ ఆది రచ్చ

 Authored By aruna | The Telugu News | Updated on :12 August 2022,6:20 pm

Hyper Aadi : బుల్లితెరపై వచ్చే ఢీ షో, దాంట్లో ఆది చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఢీ షోకు కర్త కర్మ క్రియ అంతా కూడా ఆది అన్నట్టు నడుస్తుంటుంది. ఆది అనేవాడు ఒకప్పుడు ఢీ షోకు రైటర్‌గా పని చేస్తుండే వాడు. పరదేశీ కూడా ఢీ షోకు రైటర్‌గా పని చేస్తాడట. అలా మొత్తానికి ఆది తెర ముందు తెర వెనుకా ఢీ షోను నడిపిస్తుంటాడు. అందుకే ఆదినే అందరి మీద పంచులు వేస్తుంటాడు. ఆది ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగుతుంటుంది..

ఇక ఆది జడ్జ్‌లను కూడా వదిలిపెట్టడు. అందరినీ తన పంచులతో ఆడుకుంటాడు. మరీ ముఖ్యంగా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల పరువుతీయడంలో ఆది ముందుంటాడు. వారికి ఆడవాళ్ల పిచ్చి ఉందన్నట్టుగా ప్రోజెక్ట్ చేయడంలో ఆది వేసే పంచులే కారణం. ఆది ఆ ఇద్దరినీ అమ్మాయిల వీక్ నెస్ ఉందన్నట్టుగా మార్చేశాడు. తెరపై ఆది వేసే పంచులు వారి ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుంటాయి. తాజాగా వదిలిన ఢీ ప్రోమోలో హైపర్ ఆది తెగ రెచ్చిపోయాడు.

Hyper Aadi Double Meaning Dailouges on Jani Master in Dhee Show

Hyper Aadi Double Meaning Dailouges on Jani Master in Dhee Show

Hyper Aadi : రెచ్చిపోయిన హైపర్ ఆది..

శ్రద్ద.. ఇకపై నా శ్రద్ద అంతా నీ మీద పెడతాను అని ఆది ఎంతో ఫీల్‌తో చెబుతాడు. కానీ శ్రద్దా చెవిలో శేఖర్ మాస్టర్ ఏదో చెబుతాడు. నా శ్రద్ద అంతా కూడా మాస్టర్ మీదే అని శ్రద్దా దాస్ అంటుంది. ఇది నువ్ చెప్పావా? ఆయన చెప్పమన్నాడా? అంటూ జానీ మాస్టర్ మీద కౌంటర్లు వేస్తాడు ఆది. ఇంకో సందర్భంలో శ్రద్దా దాస్ చెవిలో ఏదో చెప్పబోతాడు జానీ మాస్టర్. ఇక ఆయన మొదలుపెట్టాడు.. మొదలుపెట్టాడంటే వదలడు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లో జానీ మాస్టర్ పరువుతీస్తాడు ఆది.

అయితే వాటిని జానీ మాస్టర్ బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. జానీ మాస్టర్, శ్రద్దా దాస్, ఆది కాంబోలో ఫన్ బాగానే వర్కవుట్ అవుతోంది. అయితే ఇది ఇలానే కొనసాగితే వారి ఇమేజ్ మీద పూర్తిగా ఇలాంటిదే ఫిక్స్ అయిపోతుందని వారి వారి అభిమానులు అనుకుంటున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది