Hyper Aadi : భార్యను పరిచయం చేసిన హైపర్ ఆది.. స్టేజ్ మీద దడదడలాడించేశాడుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : భార్యను పరిచయం చేసిన హైపర్ ఆది.. స్టేజ్ మీద దడదడలాడించేశాడుగా

 Authored By prabhas | The Telugu News | Updated on :30 June 2022,2:30 pm

Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది చేసే కామెడీ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ మధ్య ఆది కామెడీని జబర్దస్త్ షోలో అందరూ మిస్ అవుతున్నారు. గత నెల రోజులుగా ఆది ఆ షోలో కనిపించడం లేదు. ఇకపై కనిపిస్తాడన్న నమ్మకం కూడా ఎవ్వరికీ లేదు. జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరిగా అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఇక ఆ షో సంగతి అలా ఉంచితే.. ఆది మాత్రం ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీలో బాగానే ఆడేస్తున్నాడు. ఈ రెండు షోల్లో ఇప్పుడు ఆది ఆధిపత్యమే కనిపిస్తోంది. ఆది చెప్పిందే అక్కడ జరుగుతున్నట్టుంది. ఇక ఢీ షోలో ఆది చేసే స్కిట్లు, వేసే కామెడీ డైలాగ్స్, పంచ్‌లు మాత్రం మామూలుగా ఉండవు.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది రెచ్చిపోయాడు. తన భార్య అంటూ తేజుని పరిచయం చేశాడు. తను నా భార్య, వాళ్లంతా నా పిల్లలు అని ఢీ కంటెస్టెంట్లను చూపించాడు. ఇక వచ్చే వారం మొత్తం కూడా తేజు తన భార్య అన్నట్టుగానే ఆది ఫిక్స్ అయినట్టున్నాడు. అయితే ఆది ఏం చేయలేడు.. అక్కడంతా సీన్ లేదంటూ తేజు దారుణంగా పరువు తీసేసింది.వద్దంటే నలుగురిని కన్నదంటూ ఆది మరింత రెచ్చిపోతాడు. ఆ తరువాత మరో స్కిట్‌‌లో తేజుతో ఆది మరింత సరసాలు ఆడతాడు. తేజు ఏదో చెప్పడానికి వస్తుంది..కానీ పెద్ద డైలాగ్ అవ్వడంతో చెప్పలేకపోతోంది. దాని మీదా ఆది సెటైర్లు వేస్తాడు.

Hyper Aadi Fun With teju in Dhee Latest promo

Hyper Aadi Fun With teju in Dhee Latest promo

ఈ డాడీ బాగా లేడు మార్చేద్దామని పిల్లలు అంటారు. ఏంట్రా డాడీని మార్చేస్తారా?అని ఆది ఆశ్చర్యపోతాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నా? ఏదో ఒకటి చేద్దామని తేజు అంటుంది. ఏం చేస్తున్నావే అని ఆది అంటే.. కుక్కర్ విజిల్స్ వేయడం లేదు అని తేజు అంటుంది. గణేష్ మాస్టర్‌ని అడుగు ఐదు విజిల్స్ వేస్తాడు అని ఆది కౌంటర్ వేస్తాడు. అలా మొత్తానికి ప్రోమోలో ఆది అందరినీ దడదడలాడించేశాడు. ఆది తన భార్య, పిల్లలు అంటూ హంగామా చేశాడు. మరి రియల్ లైఫ్‌లో ఆది తన భార్యను ఎప్పుడు పరిచయం చేస్తాడన్నది చూడాలి. ఇప్పటికే ఆది పెళ్లి మీద లెక్కలేనన్ని రూమర్లు వచ్చేశాయి.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది