Hyper Aadi : పుకార్లకు హైపర్ ఆది చెక్ పెట్టే రోజు వచ్చింది… ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 20, 2022, 10:00 am

Hyper Aadi : జబర్దస్త్‌ ఆరంభం అయ్యి దాదాపుగా దశాబ్ద కాలం అవుతుంది. ఈ దశాబ్ద కాలంలో ఎంతో మంది జీరోలు కాస్త హీరోలు అయ్యారు. కెమెరా అంటే తెలియని వారు కూడా కెమెరా ముందుకు వచ్చి స్టార్స్ గా పేరును దక్కించుకున్నారు .అద్బుతమైన ప్రతిభతో జబర్దస్త్‌ లో వెలుగు వెలిగిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో హైపర్ ఆది ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.జబర్దస్త్‌ ప్రారంభం అయిన నాలుగు అయిదు సంవత్సరాలకు హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు.

ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొత్తం జబర్దస్త్‌ రూపం మారిపోయింది. లేడీ గెటప్‌ లు పోయి రియల్‌ ఆడవారు వచ్చారు. జడ్జ్‌ లు మరియు యాంకర్ లు కూడా స్కిట్ లో భాగస్వామ్యం అయ్యారు. అలా జబర్దస్త్‌ కార్యక్రమం మెల్ల మెల్లగా స్టార్‌ షో గా నెం.1 షో గా నిలిచింది.ఆదికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాంటి హైపర్‌ ఆది ఇప్పుడు జబర్దస్త్‌ లో కనిపించడం లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు. గత నాలుగు అయిదు వారాలుగా ఆది కనిపించడం లేదు.

hyper aadi good bye to etv jabardasth

hyper aadi good bye to etv jabardasth

వచ్చే వారంతో హైపర్ ఆది ఉన్నాడా లేదా అనే పుకార్లకు చెక్ పెట్టే అవకాశం ఉందని అంతా భావించారు. ఆ రోజు రానే వచ్చింది. వచ్చే వారం కు సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో కూడా ఆది కనిపించలేదు. దాంతో జబర్దస్త్‌ కు ఆది గుడ్‌ బై చెప్పినట్లే అంటున్నారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది కనిపించడం చర్చనీయాంశం అవుతుంది. అక్కడ లేకుండా ఇక్కడ ఎలా సాధ్యం అంటూ చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ ఇప్పుడు ఆది నుండి ప్రకటన కోరుకుంటున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp