వీడియో : హగ్గుల కోసం ఆరాటం.. రెచ్చిపోయిన హైపర్ ఆది

Authored By Cinema Desk | The Telugu News | Published on: May 28, 2021, 1:05 pm

Hyper Aadi ప్రస్తుతం బుల్లితెర మీద షోలు ఎంతగా హిట్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. పులిహెర కలపడం, రొమాంటిక్ ట్రాకులు క్రియేట్ చేయడం వంటివి చేస్తూ షోలను ముందుకు తీసుకెళ్తున్నారు. అది పాటల షో అయినా డ్యాన్స్ షో అయినా మరేదైనా సరే ఈ ట్రాకులు మాత్రం ఉండాల్సిందే. ఇక ఢీ షోలో జరిగే వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో హైపర్ ఆది, సుధీర్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సుధీర్ రష్మీ ట్రాక్ ఆల్రెడీ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతూనే ఉంది.

Hyper Aadi  హైపర్ ఆది వర్షిణితో రచ్చ

Hyper Aadi hugs Deepika Pilli In Dhee

Hyper Aadi hugs Deepika Pilli In Dhee

ఇక హైపర్ ఆది  Hyper Aadi మాత్రం అందరితో పులిహోర కలుపుతూనే ఉంటాడు. గత సీజన్‌లో వర్షిణితో రచ్చ చేశాడు. ఇప్పుడు దీపిక పిల్లితో ట్రాక్ నడిపేందుకు చూస్తున్నాడు. ఇక మధ్య మధ్యలో ప్రియమణికి కౌంటర్లు వేస్తుంటారు. ప్రియా అంటూ ప్రేమ లేఖలు, కవిత్వాలు చెబుతుంటాడు. అలా హైపర్ ఆదికి సపరేట్ ట్రాక్ అంటూ లేకపోయింది. అయితే తాజాగా వదిలిన ఢీ ప్రోమోలో హైపర్ ఆది రెచ్చిపోయాడు. దీపిక ఇచ్చే హగ్గు కోసం సాహసం చేసేశాడు.

హైపర్ ఆది Hyper Aadi పై ఇద్దరు డ్యాన్సర్లు ఎక్కేశారు. చెరో వైపు ఎక్కడంతో ఆది కుప్పకూలిపోయాడు. అలా ఆది పడిపోవడంతో దీపిక ఆఫర్ ఇచ్చింది. అలా ఇద్దరినీ ఎత్తుకుంటే వచ్చి హగ్ ఇస్తానని చెప్పేసింది. దీపిక హగ్ ఇస్తానంటే పది మందినైనా సరే ఎత్తుకుంటానని, ఆ చాలెంజ్‌ను పూర్తి చేశాడు. అలా దీపిక హగ్ ఇవ్వడంతో ఆది గాల్లో తేలిపోయాడు. మొత్తానికి హగ్గులతో ఢీ షో మొత్తం వేడెక్కిపోయేలా ఉంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp