Home » Entertainment » Hyper Aadi Humiliates Pragathi In Mana Oori Devudu
Entertainment

Hyper Aadi : ప్రగతి అది బాగా పెంచేస్తోందట.. రెచ్చిపోయిన హైపర్ ఆది

Authored By
aruna
The Telugu News | Published on: August 21, 2022, 5:40 pm
Advertisement

Hyper Aadi : హైపర్ ఆది నోటికి అడ్డూ అదుపు ఉండదన్న సంగతి తెలిసిందే. ఎదుట ఉన్నది ఎవరన్నది కూడా ఆది పట్టించుకోడు. తన స్టైల్లో పంచులు వేసుకుంటూ వెళ్తుంటాడు. అలా ఆది వేసే పంచ్‌లు ఒక్కోసారి బాగానే నవ్విస్తుంటాయి. ఇంకొన్ని సార్లు కొందరికి ఇబ్బందిలా అనిపిస్తుంటాయి. అయితే వాటిని తెరపై మాత్రం అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంటుంది. తాజాగా ప్రగతిని మీద వరుసగా సెటైర్లు వేసుకుంటూ వెళ్లాడు. మామూలుగానే ప్రగతి అంటే ఇప్పుడు డ్యాన్సులు, జిమ్‌లో వర్కవుట్లు గుర్తుకు వస్తుంటాయి.

Advertisement

ఆమె బాడీ బిల్డింగ్, జిమ్‌లో చేసే రకరకాల వ్యాయామాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ వయసులోనూ ఇంతగా కష్టపడుతున్నారని కొందరు ప్రశంసిస్తుంటే.. ఈ వయసులో మీకు ఇవన్నీ అవసరమా? అంటూ కామెంట్లు చేస్తుంటారు. అయితే తాజాగా ప్రగతి మీద ఆది దారుణమైన కామెంట్లు వేశాడు. ఆమె భుజం మీద ఉంటే టాటూ మీద కూడా కౌంటర్లు వేశాడు. మనవళ్లకు టీకాలు వేయించుకునే వయసులో ఈ టీకాలు ఏంటి? అని కౌంటర్లు వేస్తాడు ఆది.

Hyper Aadi Humiliates Pragathi in Mana Oori Devudu

Advertisement

దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. పిల్లల్ని పెంచమంటే కండల్ని పెంచుతుంది అని మరో కౌంటర్ వేస్తాడు హైపర్ ఆది. దీంతో ప్రగతి నోరెళ్లబెడుతుంది. అయితే ఇవి స్కిట్లో భాగంగానే రాసిన పంచ్‌లు, ప్రాసలు, కౌంటర్లు అయినా కూడా.. జనాల్లో ఇప్పుడు ఇదే చర్చగా మారింది. ఇవే మాటలు బయట నెటిజన్లు అంటే హర్ట్ అవుతారు. కానీ తెరపై అందరి ముందు ఆది ఇలా వేస్తే మాత్రం పగలబడి నవ్వుతుంటారని కామెంట్లు పెడుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి