Hyper Aadi is in the process of putting the new anchor on line
Hyper Aadi : జబర్దస్త్ లోకి కొత్త యాంకర్ వచ్చిన విషయం తెలిసిందే. అనసూయ ను రీప్లేస్ చేస్తూ ఆమె ప్లేస్ లో రష్మీని సౌమ్య రావు ను తీసుకువచ్చారు. సౌమ్యా రావు గత గురువారం ఎపిసోడ్ నుండే యాంకర్ గా బాధ్యతలు చేపట్టింది. వచ్చిరాని తెలుగుతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అందర్నీ ఆకర్షిస్తుంది సౌమ్య. ఇది ఇలా ఉండగా హైపర్ ఆది కొత్త యాంకర్ ను లైన్లో పెట్టేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. ఆమె వచ్చి రాగానే ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ ఎపిసోడ్ నుంచే పులిహోర కలుపుతున్నారు.
ఇక ఈ విషయం సౌమ్యకే అర్థమయిపోయింది. దీంతో సౌమ్య నువ్వు ఎంత పులిహోర కలిపినా నేను పడను అంటూ చెప్పేసింది. ఇటీవల నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా దానిలో సౌమ్యారావు షార్ట్ ఫ్రాక్ ధరించి కనిపించింది. దీంతో ఈమె కూడా మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్నట్లుగా అనిపిస్తుంది.
అయితే రష్మీ అనసూయ లకు ఆ రేంజ్ లో క్రేజ్ రావడానికి కారణం బాడీ షో అని చెప్పాలి. ఏ తెలుగు యాంకర్లు చేయని సాహసం రష్మీ అనసూయ చేసి మంచి క్రేజ్ ను సాధించారు. అనసూయ అయితే బాడీ షో చూపించడంలో ఏమాత్రం ఆలోచించదు. తన అందాలను చూసినవారు ఎవరైనా ఆమెకు ఫిదా అవ్వాల్సిందే. తెలుగు సంప్రదాయాలను పక్కన పెట్టేసి బుల్లితెర ప్రేక్షకులకు , మంచి గ్లామర్ ట్రేట్ ను ఇచ్చారు. ఇక అనసూయ ఎన్నోసార్లు తన బట్టల విషయం లో తీవ్ర విమర్శలు తలెత్తిన ఆమె ఏ మాత్రం తగ్గలేదు. తనకు నచ్చినట్లుగా చేస్తూ బాడీ షో తో మంచి క్రేజ్ ను సాధించి. ఈ క్రేజ్ తోనే ఇప్పుడు వెండితెరపై వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది . మరి ఇప్పుడు ఆమె వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన సౌమ్య కూడా మెల్లగా అదే పద్ధతులు అలవర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ప్రోమోలో సామ్య అలవైకుంఠపురం లోని బుట్ట బొమ్మ సాంగ్ కి షార్ట్ ఫ్రాక్ వేసుకొని ఇంటర్ ఇచ్చింది.
Hyper Aadi is in the process of putting the new anchor on line
సాంగ్ అయిపోగానే…ఆది ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు ఒక్కదానివే డాన్స్ వేస్తే ఒట్టి బొమ్మ నాతోపాటు వేస్తే బుట్ట బొమ్మ అవుతుంది అని అన్నాడు. నువ్ ఎంత పులిహోర కలిపినా నేను నీకు పడనులే అని సౌమ్యా రావు అంటుంది. దానికి ఆది నేనెవరో తెలుసా? చిరంజీవి అభిమానిని అని అన్నారు. చిరంజీవి అయితే కాదు కదా అంటూ సౌమ్యరావు పంచ్ వేసింది . అయితే రష్మి వెంటపడి సుదీర్ తన కెరీర్ ని సెట్ చేసుకున్నాడు. బుల్లితెర సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఇప్పుడు హీరోగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు హైపర్ ఆది కూడా సుధీర్ ఫార్ములను ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే వచ్చి రాగానే యాంకర్ సౌమ్యను లైన్ లో పెట్టే పనిలో పడ్డాడు ఆది. ఇదిలా ఉండగా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఒక్కొక్కరు మరల తిరిగి జబర్దస్త్ కు వస్తున్నారు. దీంతో జబర్దస్త్ కి మరల పూర్వవైభవం వస్తుందని జబర్దస్త్ మేకర్స్ భావిస్తున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.