Hyper Aadi : హైపర్ ఆదిని జబర్దస్త్‌ వాళ్లు మొదట్లో ఎంతగా అవమానించారో, తిండి కూడా..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 17 February 2023, 9:00 am

Hyper Aadi : ఈటీవీ, మల్లెమాలలో ప్రస్తుతం హైపర్ ఆది ఒక సూపర్ స్టార్ అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ ఇప్పుడు హైపర్ ఆదికి ఉంది. జబర్దస్త్ నుండి తప్పుకున్నప్పటికీ హైపర్ ఆదికి ఉన్న ఆదరణ మరియు అతని యొక్క క్రేజ్ నేపథ్యంలో మల్లెమాల వారు ఆయన్ని వదిలి పెట్టడం లేదు. వరుసగా ఏదో ఒక షో లేదా ఇతర కార్యక్రమాల్లో చూపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం హైపర్ ఆది ఒక సూపర్ స్టార్ కానీ జబర్దస్త్ లో అడుగు పెట్టడానికి ముందు మరియు అడుగు పెట్టిన కొన్నాళ్ల వరకు అత్యంత గట్టు పరిస్థితులను ఎదుర్కొన్నాడు.

Hyper Aadi jabardasth and movie industry journey

Hyper Aadi jabardasth and movie industry journey

ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం లో కెరీర్‌ ను ప్రారంభించిన సమయంలో ఎపిసోడ్‌ ప్రారంభమైన సమయంలో హైపర్ ఆది కనిపిస్తాడా లేదా అన్నట్లుగా చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం హైపర్ ఆది ప్రతి స్కిట్ లో కనిపిస్తున్నాడు. ఒకప్పుడు హైపర్ ఆదికి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా కేవలం భోజనం పెట్టి పంపించేవారట. ఒకానొక సమయంలో కనీసం భోజనం కూడా పెట్టకుండా అన్నపూర్ణ స్టూడియోస్ లోకి నిన్ను రానివ్వడమే ఎక్కువ అన్నట్లుగా అవహేళన చేసేవారట.

Hyper Aadi jabardasth and movie industry journey

Hyper Aadi jabardasth and movie industry journey

అలా ఇండస్ట్రీలో కష్టపడి తనకంటూ గుర్తింపుని సొంతం చేసుకున్న హైపర్ ఆది ఇప్పుడు టాలీవుడ్ లో కూడా గొప్ప కమెడియన్ గా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాలో హైపర్ ఆది అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కనుక ఆ సినిమా ఆదికి అత్యంత కీలకంగా మారింది. ఆ సినిమా తర్వాత ఆది రెగ్యులర్ గా స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయిదు వందల రెమ్యూనరేషన్ వస్తే చాలు అనుకున్న ఆది ఇప్పుడు రోజుకు అయిదు లక్షలకు మించిన రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి