Hyper Aadi : మాకు బ్రేకప్ అయింది!.. మొత్తానికి ఓపెన్ అయిన హైపర్ ఆది
Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆయన వేసే పంచులకు అవతలి వాళ్లు రోస్ట్ అయిపోవాల్సింది. తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీనంతగా సెటైర్లతో వాయించేస్తుంటాడు. పంచ్‌లు వేయాలన్నా, బాడీ షేమింగ్ మీద సెటైర్లు వేయాలన్నా కూడా హైపర్ ఆది తరువాతే ఎవ్వరైనా. అలాంటి ఆది.. ఢీ షోలో తనలోని కొత్త యాంగిల్‌ను చూపిస్తుంటాడు.
తాజాగా ఢీ 14వ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఆది, ప్రియమణి, గణేష్ మాస్టర్, ప్రదీప్ అలానే ఉన్నారు. కానీ పూర్ణ స్థానంలో నందితా శ్వేత వచ్చింది. రష్మీ, సుధీర్, దీపిక పిల్లి ఢీ షోలో కనిపించడం లేదు. వారి స్థానంలో రవికృష్ణ, అఖిల్ సార్థక్ వచ్చారు. ఏదో అలా షోను నడిపిస్తున్నారంతే. సుధీర్ రష్మీ చేసిన మ్యాజిక్‌ను మాత్రం క్రియేట్ చేయడం లేదు.
Hyper Aadi Love On Priyamani In Dhee Show
Hyper Aadi : ప్రియమణిపై ప్రేమను బయటపెట్టేసిన ఆది..
ఇక ఆది బాధ అయితే ఆయనదే అన్నట్టుగా మారింది. ప్రియమణితో బావా అని పిలుపించుకుంటాడో.. చూడలేని, వినలేనట్టుగా ఈ ఇద్దరి ట్రాక్ ఉంటుంది. మాకు బ్రేకప్ అయిందంటూ ప్రియమణి గురించి ఆది అంటాడు. ఇదే సందు అనుకుని ప్రియమణి వద్ద అఖిల్, రవికృష్ణలు హగ్గులు తీసుకుంటారు. ఈ దెబ్బకు ఆది మొహం మాడిపోతుంది. మీరు ప్రియమణి దగ్గర తీసుకుంటారా? అని నందితను హగ్ అడుగుతాడు ఆది. కానీ ఆమె ఇవ్వకుండా పరువుతీసేస్తుంది.