Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై అందరినీ నవ్విస్తుంటాడు. తన కౌంటర్లు, పంచులు, సెటైర్లతో అందరినీ అలా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు.ఆది ఎప్పుడూ కూడా స్టేజ్ మీద తన పర్సనల్ విషయాలు పంచుకోడు.కానీ అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్ల కోసం తన పాత లవ్ స్టోరీని చెబుతుంటాడు. అలా తన మొదటి ప్రేమ కథను చెప్పేశాడు. తన ఫ్యామిలీ అంతా బాగానే ఉందని, అప్పులన్నీ తీర్చేశామంటూ ఇలా ఆది కొన్ని కొన్ని విషయాలు పంచుకున్నాడు. అయితే ఆది తన ఫ్యామిలీని ఎక్కువగా స్క్రీన్ మీదకు తీసుకురాలేదు. దానికి ఓ కారణం ఉందని ఇప్పుడు తెలుస్తోంది. హైపర్ ఆది తన ఊర్లో ఇప్పుడు ఇరవై ఎకరాలు కొనేశాడట.
అక్కడ కూడా ఓ ఇళ్లు కట్టేశాడట. ఇప్పుడు హైద్రాబాద్‌లోనూ ఓ ఇళ్లు కట్టేసుకున్నాడు.ఊర్లో ఉన్న పొలాలు ఒకప్పుడు అమ్మేసుకుంటే.. ఇప్పుడు అక్కడే ఇలా ఇరవై ఎకరాలు కొనేయడం ఆనందంగా ఉందంటూ ఆది చెప్పుకొచ్చాడు. అదంతా కూడా జబర్దస్త్ వల్లే అని చెబుతుంటాడు ఆది. ఇప్పుడు ఆది తన బాధను అందరి ముందు పెట్టేశాడు. అందరినీ ఏడిపించేశాడు. మామూలుగానే ఆది ఎక్కువ ఎమోషనల్ అవ్వడు. కానీ ఈ సారి మాత్రం ఏడ్చేశాడు. దీపావళి కోసం మల్లెమాల ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఇది కదా పండుగంటే అనే ఈవెంట్లో సంగీత, యాంకర్ రవి, రష్మీ, జబర్దస్త్ గ్యాంగ్ ఇలా అందరూ వచ్చారు.
సంగీతను ఒక్క చాన్స్ అని ఖడ్గంలో అడిగినట్టుగా ఆది అడిగేస్తాడు. దేనికి అని సంగీత అనడం.. దేనికైనా సరే అని ఆది తన వక్రబుద్దిని చూపించేస్తాడు. అందరూ పగలబడి నవ్వేస్తారు. అయితే సర్ ప్రైజ్ అంటూ ఆదికి ఓ వీడియోను చూపించారు. ఆది వాళ్ల అమ్మ మాట్లాడుతూ.. అక్కడికి రావాలని నాకు కూడా ఉంటుంది.. కానీ నేను రాలేను.. నిమిషం పాటు కూడా నిల్చోలేను.. మోకాళ్ల నొప్పులు అంటూ ఆది వాళ్ల అమ్మ చెప్పేసింది. దీంతో ఆది కన్నీరు పెట్టేసుకున్నాడు. తన అమ్మ, కుటుంబ పరిస్థితి చెబుతూ స్టేజ్ మీదే కంటతడి పెట్టేసుకున్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.