Hyper Aadi on Jani Master And Shraddha Das in Dhee Promo
Hyper Aadi : బుల్లితెరపై ఢీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రఫర్లుగా ఉన్న వారంతా కూడా ఒకప్పుడు ఢీ కంటెస్టెంట్లే. ఇప్పుడు ఇండియాను ఏలేస్తున్నారు. ఢీ షోలో కంటెస్టెంట్లుగా పార్టిసిపేట్ చేసిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్లు ఇప్పుడు ఆ షోకే జడ్జ్‌లుగా ఉంటున్నారు. అయితే శేఖర్ మాస్టర్ బయటకు వెళ్లాక.. జానీ, గణేష్ మాస్టర్లే కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఇప్పుడు జానీ మాస్టర్, గణేష్ మాస్టర్లు ఇద్దరూ కూడా వచ్చారు. వారితో పాటుగా శ్రద్దా దాస్ కూడా ఉంది. గత కొన్నిరోజులుగా శ్రద్దా దాస్ జడ్జ్ స్థానంలో ఉంటోన్న సంగతి తెలిసిందే.
ప్రియమణి ఎందుకు వెళ్లిందో తెలీదు గానీ.. ఆమె స్థానంలో ఎవరో ఒకరు వస్తున్నారు. వెళ్తున్నారు. మధ్యలో నందితా శ్వేత వచ్చింది. పూర్ణ కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు శ్రద్దా దాస్ కంటిన్యూ అవుతోంది. తాజాగా వదిలిన ప్రోమోలో హైపర్ ఆది అందరినీ ఆడుకున్నాడు. స్వీట్ మాస్టర్ ఎవరు, నాటీ మాస్టర్ ఎవరు? అని గణేష్, జానీ మాస్టర్లను చూపించి శ్రద్దా దాస్‌ను అడిగేశాడు ఆది. నాటీ మాస్టర్ అంటే జానీ మాస్టరే అని శ్రద్దా దాస్ తెలిపింది. ఎంత ఇబ్బంది పెట్టి ఉండకపోతే ఆమె అలా అంటుంది అని జానీ మాస్టర్ పరువుతీసేందుకు ఆది ప్రయత్నిస్తాడు.
Hyper Aadi on Jani Master And Shraddha Das in Dhee Promo
ఇంతలో శ్రద్దా దాస్ ఇంకో విషయాన్ని బయటపెడుతుంది. ఈ రోజు మాస్టర్ నాకు ఓ కాంప్లిమెంట్ ఇచ్చాడు అని శ్రద్దా దాస్ అసలు విషయం బయటపెడుతుంది. ఏంటి అది అని ఆది అడుగుతాడు. నేను ఈరోజు హాట్‌గా ఉన్నాను అని మాస్టర్ అన్నాడు అంటూ శ్రద్దా దాస్ చెబుతుంది. దీంతో ఆది ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు. ఇంతలా ఇబ్బంది పెడతారా? అంటూ.. అరుంధతిని కూడా పశుపతి ఇంతలా ఇబ్బంది పెట్టి ఉండడు అంటూ జానీ మాస్టర్ మీద ఆది కౌంటర్లు వేస్తుంటాడు.
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
This website uses cookies.