Hyper Aadi : శ్రద్దా దాస్‌ను ఇబ్బంది పెట్టిన జానీ మాస్టర్.. బయటపెట్ఠేసిన హైపర్ ఆది

Authored By aruna | The Telugu News | Published on: September 9, 2022, 8:30 pm

Hyper Aadi : బుల్లితెరపై ఢీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రఫర్లుగా ఉన్న వారంతా కూడా ఒకప్పుడు ఢీ కంటెస్టెంట్లే. ఇప్పుడు ఇండియాను ఏలేస్తున్నారు. ఢీ షోలో కంటెస్టెంట్లుగా పార్టిసిపేట్ చేసిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్లు ఇప్పుడు ఆ షోకే జడ్జ్‌లుగా ఉంటున్నారు. అయితే శేఖర్ మాస్టర్ బయటకు వెళ్లాక.. జానీ, గణేష్ మాస్టర్లే కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఇప్పుడు జానీ మాస్టర్, గణేష్ మాస్టర్లు ఇద్దరూ కూడా వచ్చారు. వారితో పాటుగా శ్రద్దా దాస్ కూడా ఉంది. గత కొన్నిరోజులుగా శ్రద్దా దాస్ జడ్జ్ స్థానంలో ఉంటోన్న సంగతి తెలిసిందే.

ప్రియమణి ఎందుకు వెళ్లిందో తెలీదు గానీ.. ఆమె స్థానంలో ఎవరో ఒకరు వస్తున్నారు. వెళ్తున్నారు. మధ్యలో నందితా శ్వేత వచ్చింది. పూర్ణ కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు శ్రద్దా దాస్ కంటిన్యూ అవుతోంది. తాజాగా వదిలిన ప్రోమోలో హైపర్ ఆది అందరినీ ఆడుకున్నాడు. స్వీట్ మాస్టర్ ఎవరు, నాటీ మాస్టర్ ఎవరు? అని గణేష్, జానీ మాస్టర్లను చూపించి శ్రద్దా దాస్‌ను అడిగేశాడు ఆది. నాటీ మాస్టర్ అంటే జానీ మాస్టరే అని శ్రద్దా దాస్ తెలిపింది. ఎంత ఇబ్బంది పెట్టి ఉండకపోతే ఆమె అలా అంటుంది అని జానీ మాస్టర్ పరువుతీసేందుకు ఆది ప్రయత్నిస్తాడు.

Hyper Aadi on Jani Master And Shraddha Das in Dhee Promo

Hyper Aadi on Jani Master And Shraddha Das in Dhee Promo

ఇంతలో శ్రద్దా దాస్ ఇంకో విషయాన్ని బయటపెడుతుంది. ఈ రోజు మాస్టర్ నాకు ఓ కాంప్లిమెంట్ ఇచ్చాడు అని శ్రద్దా దాస్ అసలు విషయం బయటపెడుతుంది. ఏంటి అది అని ఆది అడుగుతాడు. నేను ఈరోజు హాట్‌గా ఉన్నాను అని మాస్టర్ అన్నాడు అంటూ శ్రద్దా దాస్ చెబుతుంది. దీంతో ఆది ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు. ఇంతలా ఇబ్బంది పెడతారా? అంటూ.. అరుంధతిని కూడా పశుపతి ఇంతలా ఇబ్బంది పెట్టి ఉండడు అంటూ జానీ మాస్టర్ మీద ఆది కౌంటర్లు వేస్తుంటాడు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp