hyper aadi punch on biggboss siri and shannu in dasara event
Hyper Aadi : ఈటీవీలో ప్రసారం కాబోతున్న దసరా ప్రత్యేక ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ ప్రోమోలో హైపర్ ఆది ఎప్పటి మాదిరిగానే తనదైన శైలిలో పంచ్ ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులని నవ్వించాడు. అదే మాదిరిగా ఇప్పుడు చేసినట్లుగానే ఇతరులపై అవమానకరమైన వ్యాఖ్యలను చేస్తూ అవతలి వారిని ఇబ్బంది పెట్టాడు ఆ పంచ్ లు వేయబోతున్నట్లుగా ముందే హైపర్ ఆది వాళ్లకు చెబుతాడట. అయినా కూడా వారు ఆ సమయంలో ఇబ్బంది పడ్డట్లుగా అనిపిస్తుంది. ఎంతో మంది సీనియర్ లను అవమానకరంగా వ్యాఖ్యలు చేసే హైపర్ ఆది తాజాగా సిరి హనుమంతు పై తనదైన శైలి పైత్యపు కామెడీ పంచ్ వేశాడు.
బిగ్ బాస్ హౌస్ లో ఒక షన్నూ కి మాత్రమే నువ్వు ఫన్ ఇచ్చావు కానీ ప్రేక్షకులకు ఇవ్వలేదు అన్నట్లుగా హైపర్ ఆది కామెంట్ చేశాడు. అప్పుడు సిరి హనుమంతు కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. బిగ్ బాస్ లో ఉన్న సమయంలో సిరి మరియు షన్నూ బాగా దగ్గరయ్యారు, వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చర్చించుకున్నారు. కేవలం ఆ రిలేషన్ వల్లే షన్నూ కి బిగ్ బాస్ ట్రోఫీ దకాల్సింది దక్కలేదు అనడంలో సందేహమే లేదు. బయటికి వచ్చిన తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ఇద్దరు కూడా అసలు కలిసిందే లేదు. బిగ్ బాస్ హౌస్ లో వారిద్దరు కేవలం రేటింగ్ కోసమే అలా నటించారు అనేది చాలా మంది ఇప్పటికి నమ్ముతున్నారు.
hyper aadi punch on biggboss siri and shannu in dasara event
గడిచిపోయిన విషయాన్ని, కొన్ని చేదు సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోకుంటేనే మంచిది కాదు. ఇప్పుడు సిరి తో ఆ విషయం మాట్లాడితే ఆమె కచ్చితంగా ఫీల్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయినా కూడా హైపర్ ఆది ఏమాత్రం మొహమాటం లేకుండా పిచ్చి కూతలు కూస్తూ ఇష్టానుసారంగా కామెడీ పేరుతో అవతలి వారిని విమర్శిస్తూ ఉన్నాడు. ఇది ఆయన తీసుకొచ్చిన కొత్త రకం కామెడీ.. దీనిని చాలా మంది తప్పుపడుతున్నారు, అయినా కూడా అతను మాత్రం తన దైన శైలిలో ముందుకు సాగుతున్నాడు తప్పితే ఇతరులు బాధపడుతున్నారు కొందరు తిడుతున్నారు అని ఆలోచించడం లేదు. ఇతని ఈ కొత్త రకం కామెడీ ఎన్నాళ్ళు నవ్వు తెప్పిస్తుందో కానీ చిరాకు మాత్రం తెప్పించడం మొదలైంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.