Hyper Aadi : నాగబాబు చర్చలు సఫలం.. కామెడీ స్టార్స్ లో హైపర్ ఆది ఎంట్రీకి డేట్‌ ఫిక్స్‌

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 1, 2022, 7:00 pm

Hyper Aadi : జబర్దస్త్ ను మాత్రమే కాకుండా టీవీవి మరియు మల్లెమాల వారిని పూర్తిగా హైపర్ ఆది వదిలేసారు అంటూ సమాచారం అందుతోంది. గత నెల రోజులుగా ఈ టీవీ తెరపై ఆయన కనిపించడం లేదు. గతంలో షూట్ చేసిన కొన్ని ఎపిసోడ్లు ఇప్పుడు టెలికాస్ట్ అవుతూ ఉండగా అందులో కనిపిస్తున్నాడు కానీ నెల రోజులుగా ఆయన మల్లెమాల వారికి దూరంగా ఉంటున్నాడు. ఈ సమయంలో ఆయన కొన్ని సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు తప్పితే ఇతర ఏ షో లో పాల్గొనడం లేదు అనేది ఆయన సన్నిహితుల ద్వారా వినిపిస్తున్న మాట. ఇక హైపర్ ఆది స్టార్ మా లో ప్రత్యక్షం కాబోతున్నాడు అనేది గత కొన్ని రోజులుగా వస్తున్న వార్త.

హైపర్ ఆది జబర్దస్త్ మానేసాడు అనగానే మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా ఆయనతో మాట్లాడి స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ కార్యక్రమానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం వర్కవుట్ అయ్యే దిశగా కనిపిస్తుంది. హైపర్ ఆది కామెడీ స్టార్స్‌ కార్యక్రమంలో చేసేందుకుగాను భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. స్టార్ మా వారు మొదట ఆ పారితోషికానికి నిరాకరించారని తెలుస్తుంది. కానీ నాగబాబు పట్టుబట్టి స్టార్ మా వారితో చర్చలు జరిపి కామెడీ స్టార్స్ నిర్మాతలు హైపర్ ఆది అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది.

Hyper Aadi Remuneration For Star Maa Tv Comedy Stars Show

Hyper Aadi Remuneration For Star Maa Tv Comedy Stars Show

స్టార్ మా లో అతి త్వరలోనే హైపర్ ఆది కామెడీ స్టార్స్ లో కనిపించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఒప్పందం జరిగిన కారణంగా ఇక మీదట ఈటీవీలో జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో హైపర్ ఆది కనిపించడం లేదని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఇక ముందు హైపర్ ఆది పేరు ఆదిగా మాత్రమే ఉండబోతుంది. ఆయన పేరు ముందు హైపర్ పదాన్ని మల్లెమాల వారు పెట్టారు. అది ఈటీవీ కి కాపీరైట్ ఉంటుంది. కనుక హైపర్ పదాన్ని ఆది ఉపయోగించడానికి వీలు ఉండదు. కనుక స్టార్ మాలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్‌ లో ఆది పేరుకు ముందు మరేదైనా పదాన్ని చేర్చే అవకాశాలున్నాయి. మరి స్టార్ మా వారు ముందు ఎలాంటి పదాన్ని వారు జోడిస్తారు అనేది చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp