Hyper Aadi : మా గురించి ఏవేవో రాసేస్తున్నారు.. అనసూయపై ఆది కామెంట్స్
Hyper Aadi బుల్లితెరపై ఆది, అనసూయ ట్రాక్ ఏంటో అర్థం కాదు. పెళ్లై, ఇద్దరు పిల్లల తల్లైనా కూడా తన మీద కోరిక పోలేదన్నట్టుగా ఆది రాసే డైలాగ్స్, చేసే చేష్టలు, స్కిట్లో వాడుకునే తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. అలా ఆది అనసూయలు అప్పుడప్పుడు స్కిట్లలో హద్దులు మీరుతుంటారు. ఒకప్పుడు డైలాగ్స్ వరకు మాత్రమే పరితమితమయ్యేవారు.
మధ్యలో కాస్త జోడిగా వస్తూ ఎంట్రీ సాంగ్స్‌లో దుమ్ములేపేవారు. కానీ వీరి చేష్టలు హద్దులు మీరుతుండటంతో స్కిట్లలో అనసూయ ఎంట్రీని కాస్త తగ్గించారు. అయితే తన స్కిట్లలో అనసూయను వాడుకోవడం ఆదికి అలవాటే. తాజాగా వదిలిన ప్రోమోలో అనసూయ మీద ఆది మంచి సెటైర్ వేశాడు. తమ గురించి సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, మీమ్స్ గురించి స్పందించాడు.

Hyper Aadi Satires On Anasuya In Jabardasth Show
Hyper Aadi : అనసూయపై ఆది సెటైర్లు
రైతే రాజు అని ఆది అంటే.. ఇక్కడ అందరం రైతులే కానీ నువ్ మాత్రం ఒక్క రాజునే రైతు అని అంటున్నావ్ ఏంటి? అని ఒకడు ఆదిని అంటాడు. ఒరేయ్ రైతే రాజు అంటే.. రైజింగ్ రాజు కాదురా? ఇది ఎలా ఉందంటే.. అనసూయ ఆదివారం బయటకు వెళ్తుంది అంటే..అనసూయ ఆది కలిసి వారం వారం బయటకు వెళ్తారు అని ఏదేదో రాసినట్టుందని ఆది సెటైర్ వేశాడు. దీంతో అందరూ నవ్వేశారు.