Anchor Ravi : యాంకర్ రవి పరువుతీసేశాడుగా.. హైపర్ ఆది మామూలోడు కాదు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 19, 2022, 12:30 pm

Anchor Ravi : ఏ పండుగ వచ్చినా కూడా.. ఆ పండుగకు తగ్గట్టుగా షోలు, ఈవెంట్లు చేయడంలో మల్లెమాల ముందుంటుంది. ఇక ఈవెంట్‌ను మల్లెమాల టీం అద్భుతంగా నిర్వహిస్తుంటుంది. ఆ చానెల్, ఈ చానెల్ అని తేడా లేకుండా సెలెబ్రిటీలందరినీ పట్టుకొస్తుంటుంది. మామూలుగా అయితే బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన వాళ్లని స్టార్ మా ఎక్కువగా వాడుకోవాలి. కానీ ఈటీవీ, మల్లెమాల వాళ్లే ఎక్కువగా వాడుకుంటూ ఉంటున్నారు. తాజాగా దసరా స్పెషల్ ప్రోమోను వదిలారు.

దసరాకు మల్లెమాల స్పెషల్ ప్రోగ్రాం చేయబోతోంది. ధమాకా అంటూ ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సీనియర్ హీరోయిన్ ప్రేమ, సంఘవి వంటి వారు గెస్టులుగా వచ్చారు. చాలా రోజుల తరువాత ఈటీవీలో యాంకర్ రవి కనిపించాడు. యాంకర్, హోస్ట్‌గా ఈటీవీ షోలకు రావడం మానేశాడు రవి. కానీ ఇప్పుడు ఇలా ఈ షోకు వచ్చేశాడు రవి. అయితే దీనిపై ఆది సెటైర్లు వేశాడు.

Hyper Aadi Satires on Anchor Ravi in Navaratri Dhamaka Promo

Hyper Aadi Satires on Anchor Ravi in Navaratri Dhamaka Promo

ఆది వేసే కౌంటర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. రియాల్టీకి దగ్గరగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.అసలింతకీ ఆది ఏమన్నాడో చూద్దాం. దసరా హైద్రాబాద్‌లో బాగుంటుందని అర్జున్, విజయవాడలో బాగుంటుందని సుహాసిని పోట్లాడుతుంటారు. ఏం జరిగిందని ఆది మధ్యలోకి దూరుతాడు. ఇంతలో యాంకర్ రవి వచ్చి.. అటు వెళ్లాలా? ఇటు వెళ్లాలా? అని ఆలోచిస్తున్నా అని అంటాడు. ఇది అర్థం తెలియకే.. అన్ని చానెళ్లు తిరిగేస్తున్నావ్ అంటూ గాలి తీసేస్తాడు ఆది. దీంతో యాంకర్ రవి నోరు మూసుకుంటాడు. అందరూ పగలబడి నవ్వేస్తుంటారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp