Hyper Aadi : ఇంద్ర భవనంలాంటి రోజా ఇళ్లు చూశారా?.. ఇంట్లో దుమ్ములేపిన హైపర్ ఆది

Authored By Cinema Desk | The Telugu News | Published on: February 8, 2022, 3:00 pm

Hyper Aadi : హైపర్ ఆది తన స్కిట్లను ట్రెండింగ్ టాపిక్‌లపైనే రాసుకుంటాడు. కరెంట్‌గా జరిగిన ఇష్యూలు, వివాదాల మీదే తన పంచ్‌లు వేస్తుంటాడు. ఇక ఇప్పుడు అందరూ కూడా హోం టూర్‌లంటూ పిచ్చెక్కిస్తున్నారు. సెలెబ్రిటీలంతా కూడా హోం టూర్‌ అంటూ స్పెషల్ వీడియోలను చేస్తూ ఉన్నారు. యూట్యూబ్‌లో పెడుతున్నారు. అయితే హైపర్ ఆది ఇప్పుడు కొత్తగా ట్రై చేశాడు.

రోజా, అనసూయలను తన స్కిట్లలో ఆది వాడుతుంటాడు. అందరికీ తెలిసిని విషయమే అది. అయితేఇప్పుడు ఏకంగా నగరిలోని రోజా ఇంటికి వెళ్లి హోం టూర్ చేసేశాడు. దాన్నే ఓ స్కిట్‌లా కానిచ్చేశాడు. ఏది ఏమైనా ఆది ప్లానింగ్ మాత్రం మామూలుగా లేదు. ఇక దీనికి సంబంధించిన ప్రోమోఇప్పుడు వైరల్ అవుతోంది. రోజా ఇంటితో పాటు, అందులో ఆది వేసిన పంచులు ఇంకా వైరల్ అవుతున్నాయి.

Hyper Aadi Skit In MLA Roja Home In Nagari

Hyper Aadi Skit In MLA Roja Home In Nagari

Hyper Aadi : రోజా ఇంట్లోనే స్కిట్..

అల వైకుంఠపురములో టైపులో రోజా ఇళ్లుంది. దాన్ని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఇక రోజాకు వంటే రాదన్నట్టుగా.. కనీసం టీ పెట్టడం కూడా తెలీదన్నట్టుగా చూపించారు. వంట గది మొహాన్ని ఎప్పుడూ చూడలేదని పరోక్షంగా కౌంటర్లు వేశారు. అయితే రోజా ఇది వరకే ఎన్నో వంటల వీడియోలను షేర్ చేసింది. స్పెషల్ డిషెస్‌లను కూడా వండింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp