Hyper Aadi : హైపర్ ఆది మాకు దేవుడు.. కొడుకుపై తండ్రి సంచలన వ్యాఖ్యలు!

Authored By mallesh | The Telugu News | Published on: January 2, 2022, 3:40 pm

Hyper Aadi : హైపర్ ఆది ఈ పేరు వింటే చాలు నవ్వులు పువ్వులు విరబూస్తూనే ఉంటాయి. ఏకధాటిగా కామెడీ పంచులు పేలుతూనే ఉంటాయి. బుల్లితెర నవ్వుల ప్రపంచానికి అతనో రారాజు. తక్కువ సమయంలోనే తన కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది అభిమానులను, విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక జబర్దస్త్‌లో హాట్ బ్యూటీ యాంకర్ అనసూయను హగ్ కోసం అడుక్కుంటూ తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయిస్తాడు. జబర్దస్త్‌లో ఎక్కువ స్కిట్స్ కొట్టేవారిలో ఆది ముందుంటాడు. ఇటీవల కాలంలో జబర్దస్త్‌తో పాటు పలు కామెడీ, రియార్టీ షోస్, ఈవెంట్లు కూడా చేస్తూ ఆది చాలా బిజీగా మారిపోయాడు.

సినిమాల్లో కూడా వరుసగా ఆఫర్లు కొట్టేస్తూ తన దూకుడును కొనసాగిస్తున్నాడు.న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైపర్ ఆది పలు ఈవెంట్లలో పాల్గొన్నాడు. ఇందులో ‘పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు’ అనే షో బాగా అల‌రించింది. దీనికి రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. హైపర్ ఆది తన తండ్రి, సోదరులను తీసుకొచ్చాడు. షోలో తన ఫ్యామిలీ సీక్రెట్స్‌ను ఆది రివీల్ చేసి ఫన్ జనరేట్ చేశాడు.తన తండ్రికి ఉదయాన్నే లేచి రెడీ అయి ఉంగరాలు, చైన్ మెడలో వేసుకుంటాడని ఏదో పనిమీద వెళ్తున్నట్టు కనిపిస్తాడు. కానీ వెళ్లేది వైన్ షాపునకు అని చెప్పి లాఫింగ్ బ్లాస్ట్ పేల్చాడు.

Hyper Aadi sun is God Father comments on son

Hyper Aadi sun is God Father comments on son

Hyper Aadi : తన కొడుకే మాకు దేవుడు..

నువ్వు ఎందుకు వెళ్తావు, మమ్మల్ని అడిగితే మేమే తీసుకొస్తాం కదా అని అంటే హైపర్ ఆది నాన్న వచ్చాడు అక్కడ మాట్లాడుకుంటారు. అప్పటికే అక్కడ చాలా మంది లైన్లో ఉంటే వారంతా నాకు మర్యాద ఇచ్చి ముందుకు పంపిస్తారు. అదంతా తనకు ఇష్టముండదని చెప్పుకొచ్చాడు ఆది తండ్రి.. మా ఆది లేనిది మేము లేమని.. మా కుటుంబానికి ఆదే దేవుడు అంటూ తండ్రి చెప్పిన మాటతో అంతా చలించిపోయారు. ఇక హైపర్ ఆది బ్రదర్స్ మాట్లాడుతూ వయసులో చిన్నవాడైనా మనసులో చాలా పెద్దవాడు ఆది.. మాకు ఎంతో సపోర్ట్ చేస్తాడని చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి ఎప్పుడు అని ఇంద్రజ అడగడంతో ఒంగోలులో ఓ అమ్మాయిని చూశామని కానీ ఇప్పుడే పెళ్లి వద్దని ఇంకో 2 ఇయర్స్ ఆగాలని ఆది చెప్పినట్టు గుర్తుచేశారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp