Janaki Kalaganaledu 3 Jan Tomorrow Episode : జానకి, మల్లికను కలపడానికి తెగ ప్రయత్నించిన జ్ఞానాంబ.. ఇంతలో బయటపడ్డ మల్లిక మోసం
Janaki Kalaganaledu 3 Jan Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా ప్రసారం కాదు. లేటెస్ట్ ఎపిసోడ్ తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 3 జనవరి 2022, 206 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకికి అకాడమీలో నిర్వహించిన పరీక్షలో సెకండ్ ర్యాంక్ రావడంతో ఆ విషయాన్ని తన ఇంటికి వచ్చి అభి చెబుతాడు. దీంతో జానకి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. జానకికి మంచిగా మార్కులు రావడంతో రామా కూడా ఖుషీ అవుతాడు. తన భార్యకు అభినందనలు చెబుతా అంటూ తనకు ముద్దుల మీద ముద్దుల పెడతాడు. ఆ తర్వాత జానకి కూడా రామాకు నుదుటి మీద ముద్దు ఇస్తుంది. మొత్తానికి తనకు సెకండ్ ర్యాంక్ రావడం వల్ల జానకికి ఫీజులో రాయితీ కూడా ఇస్తారని సంతోషిస్తుంది జానకి.

janaki kalaganaledu 3 january 2022 episode highlights
కట్ చేస్తే జ్ఞానాంబ, గోవిందరాజు అన్నం తింటూ ఉంటారు. జానకి వచ్చి వడ్డిస్తూ ఉంటుంది. జానకి.. నువ్వు ఆగు. మల్లికను పిలువు. ఈరోజు తను వడ్డిస్తుంది అని అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి షాక్ అవుతుంది. ఎందుకు అత్తయ్య గారు అని అడుగుతుంది జానకి. నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది. నువ్వేం తప్పు చేయలేదు కానీ.. వెళ్లి మల్లికను పిలువు అంటుంది. దీంతో మల్లికను తీసుకొని వస్తుంది జానకి. ఏంటి అత్తయ్య గారు పిలిచారు అని అడుగుతుంది మల్లిక. దీంతో భోజనం వడ్డించు అని అంటుంది జ్ఞానాంబ. అదేంటి.. రోజూ మీ ముద్దుల కోడలే కదా వడ్డించేది అని అంటుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఏం.. నువ్వు వడ్డించవా అంటే.. అప్పుడు వడ్డిస్తుంది.
వాళ్లకు భోజనం వడ్డిస్తూ మల్లిక ఓవర్ యాక్షన్ చేస్తుంది. నీకు, జానకికి ఎందుకు పడదు. జానకి అంటే నీకు ఎందుకు అంత కోపం అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో మల్లిక ఇక స్టార్ట్ చేస్తుంది. తను నాకు తోటి కోడలే కానీ.. నాకు తోబుట్టువు లాంటిది. తనతో నాకెందుకు పడదు.. అంటూ కప్పిపుచ్చుతుంది మల్లిక.
Janaki Kalaganaledu 3 Jan Tomorrow Episode : జానకిపై మల్లిక సెటైర్లు
జానకి చాలా మంచిది. తను అబద్ధాలు ఆడదు. తనకు మోసమే తెలియదు. తన అన్న యోగి కూడా అంతే. అతడు కూడా అబద్ధాలు ఆడడు.. అంటూ ఏదేదో మాట్లాడబోతుండగా.. ఇంతలో రామా వస్తాడు. ఏంటి మల్లిక.. మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు.
అసలు నువ్వు చేసిన మోసం గురించి చెబితే అని అనేలోపే.. వద్దని వారిస్తుంది జానకి. మల్లికకు డౌట్ కొడుతుంది. ఏంటి మోసం అని అడుగుతారు. ఇంతలో విష్ణు వచ్చి నేను చెబుతాను అని మల్లిక అమ్మ బట్టలు ఉతకను అని పక్కన పెట్టేసింది అని చెబుతాడు విష్ణు.
దీంతో ఇంత పని చేస్తావా అని చెప్పి గోవింద రాజు.. మల్లికకు శిక్ష విధిస్తాడు. రోజూ నువ్వు అత్తయ్య బట్టలతో పాటు నా బట్టలు కూడా ఉతకాలి అని చెబుతాడు. దీంతో మల్లికకు తెగ కోపం వస్తుంది. రజనీకాంత్ స్టయిల్ లో గోవింద రాజు.. మల్లికకు శిక్ష విధించడంతో అందరూ షాక్ అవుతారు. రామా, జానకి, జ్ఞానాంబ కూడా నవ్వు ఆపుకోలేకపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.