Hyper Adhi : మాకు పెళ్లే కాలేదు!.. వామ్మో బరితెగించిన హైపర్ ఆది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Adhi : మాకు పెళ్లే కాలేదు!.. వామ్మో బరితెగించిన హైపర్ ఆది

Hyper Adhi : హైపర్ ఆది వేసే సెటైర్లు, పంచులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది జబర్దస్త్ షో అయినా, ఇంకేదైనా స్పెషల్ ఈవెంట్ అయినా కూడా ఆది పద్దతి మాత్రం మారదు. అలా మొత్తానికి తన పంచ్‌లతో రెచ్చిపోతోంటాడు. అయితే ఈ డిసెంబర్ 31 స్పెషల్ షోను చేసేందుకు మల్లెమాల టీం ముందుకు వచ్చింది. ఇందు కోసం వరుణ్ సందేష్, వితికా షేరులను తీసుకొచ్చారు. పెళ్లాం వద్దు పార్టీ ముద్దు అనే పేరుగా డిసెంబర్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 December 2021,1:40 pm

Hyper Adhi : హైపర్ ఆది వేసే సెటైర్లు, పంచులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది జబర్దస్త్ షో అయినా, ఇంకేదైనా స్పెషల్ ఈవెంట్ అయినా కూడా ఆది పద్దతి మాత్రం మారదు. అలా మొత్తానికి తన పంచ్‌లతో రెచ్చిపోతోంటాడు. అయితే ఈ డిసెంబర్ 31 స్పెషల్ షోను చేసేందుకు మల్లెమాల టీం ముందుకు వచ్చింది. ఇందు కోసం వరుణ్ సందేష్, వితికా షేరులను తీసుకొచ్చారు.

పెళ్లాం వద్దు పార్టీ ముద్దు అనే పేరుగా డిసెంబర్ 31 పార్టీని చేసుకుంటున్నట్టుగా ఓ కాన్సెప్ట్‌తో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇందులో వరుణ్ సందేష్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాలి. కానీ భార్య వితిక మాత్రం అందుకు ఒప్పుకోదు. నన్ను పార్టీకి తీసుకెళ్లేందుకు వాళ్లు వస్తున్నారు అని భార్యకు భయపడుతున్నట్టుగా వరుణ్ సందేష్ తెగ నటించేస్తాడు.

Hyper Adhi Crossed Border In Pellam Vaddu Party Muddu

Hyper Adhi Crossed Border In Pellam Vaddu Party Muddu

Hyper Adhi : రెచ్చిపోయిన హైపర్ ఆది

అయితే హైపర్ ఆది, రాం ప్రసాద్ గ్యాంగ్ ఇలా అందరూ వస్తారు. అంతా రెడీగా ఉంది.. బండెక్కితే తీసుకెళ్తాం అని వరుణ్ సందేష్‌ను అడుగుతారు. ఏంటి చిన్న పిల్లాడు అనుకుంటున్నారా? బండెక్కితే తీసుకెళ్తామని అంటున్నారు. పెళ్లైంది.. పర్మిషన్‌లు తీసుకోవాలి.. ఎన్నెన్నో ఉంటాయి.. మీకు పెళ్లి కాలేదు కాబట్టి తెలియదు అని వితిక షేరు అంటుంది. మాకు పెళ్లే కాలేదు.. అని ఆది డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడు. పెళ్లే కాలేదు.. మిగతావన్నీ అయిపోయాయ్ అన్నట్టుగా ఆది రెచ్చిపోయాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది