Hyper adi : బిగ్‌బాస్‌ సీజన్- 5లో హైపర్ ఆది రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper adi : బిగ్‌బాస్‌ సీజన్- 5లో హైపర్ ఆది రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

 Authored By mallesh | The Telugu News | Updated on :13 October 2021,5:59 pm

Hyper adi : తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న బుల్లితెర కమెడియన్స్‌కు క్రేజ్ మాములుగా లేదు. వారు వేసే పంచులకు నవ్వు ఆపుకోవాలనుకున్నా సాధ్యం కాదంటే అర్థం చేసుకోవచ్చు. ఆ రేంజ్‌లో ఉంటుంది మరీ వాళ్ల కామెడీ. జబర్దస్త్ షో ద్వారా వీరు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యారు. అలాంటి కమెడియన్స్‌లో హైపర్ ఆది ఒకరు. అదిరిపోయే కామెడీ చేస్తుంటాడు. తన స్కిట్ వస్తున్నంతసేపు నవ్వకుండా ఉండలేరు. ఇటీవల ఆది బిగ్‌బాస్ -5 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

Hyper Adi in bigg boss 5 police getup

Hyper Adi in bigg boss 5 police getup

బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్‌ను ఇన్వెస్టిగేషన్ పేరుతో ఆటాడుకున్నాడు. కొందరికి హింట్స్ ఇస్తే.. మరికొందరికి చురకలు అంటించాడు. ఇంకొందరు గేమ్ షో‌లో చాలా బాగా ప్రదర్శన చూపుతున్నారని మెచ్చుకున్నాడు. దసరా స్పెషల్ ఈవెంట్‌‌లో కనిపించిన హైపర్ ఆది అందరినీ తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ఏకంగా 3 గంటలకు పైగానే సాగిన సండే ఈవెంట్‌లో ఎవరికి వాళ్లు తమ రోల్‌ను బాగానే పోషించినా.. కేవలం 30 నిమిషాల నిడివితో హైపర్ ఆది ఆ ఈవెంట్‌లో సింహభాగాన్ని పోషించాడనడంలో అతిశయోక్తి లేదు.

Hyper Adi in bigg boss 5 police getup

Hyper Adi in bigg boss 5 police getup

కేవలం 25 మినట్స్ పాటు సాగిన హైపర్ ఆది ఎపిసోడ్ బాగా పేలిందని చెప్పవచ్చు. ఇందుకోసం స్టార్ మా నిర్వాహకులు ముందుగానే హైపర్ ఆదితో ఒక ఒప్పందం కుదుర్చుకుని.. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాకుండా, బిగ్‌బాస్ షోను రోజు ఫాలో అవ్వాలనే నిబంధన కూడా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ సీజన్ -5లో తీసుకున్న రెమ్యూనరేషన్‌కు ఆది న్యాయం చేశాడని తెలుస్తోంది. కంటెస్టెంట్స్‌పై బాగానే పంచులు వేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే, ఈ సీజన్‌లో హైపర్ ఆది ఏకంగా రూ. 2 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్టు తెలిసింది. అతను వేసిన పంచులు, కామెడీ టైమింగ్ బాగా రావడంతో చివరి ఎపిసోడ్‌కు సైతం హైపర్ ఆదిని పిలువనున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది