Hyper adi : తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న బుల్లితెర కమెడియన్స్‌కు క్రేజ్ మాములుగా లేదు. వారు వేసే పంచులకు నవ్వు ఆపుకోవాలనుకున్నా సాధ్యం కాదంటే అర్థం చేసుకోవచ్చు. ఆ రేంజ్‌లో ఉంటుంది మరీ వాళ్ల కామెడీ. జబర్దస్త్ షో ద్వారా వీరు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యారు. అలాంటి కమెడియన్స్‌లో హైపర్ ఆది ఒకరు. అదిరిపోయే కామెడీ చేస్తుంటాడు. తన స్కిట్ వస్తున్నంతసేపు నవ్వకుండా ఉండలేరు. ఇటీవల ఆది బిగ్‌బాస్ -5 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్‌ను ఇన్వెస్టిగేషన్ పేరుతో ఆటాడుకున్నాడు. కొందరికి హింట్స్ ఇస్తే.. మరికొందరికి చురకలు అంటించాడు. ఇంకొందరు గేమ్ షోలో చాలా బాగా ప్రదర్శన చూపుతున్నారని మెచ్చుకున్నాడు. దసరా స్పెషల్ ఈవెంట్‌లో కనిపించిన హైపర్ ఆది అందరినీ తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ఏకంగా 3 గంటలకు పైగానే సాగిన సండే ఈవెంట్‌లో ఎవరికి వాళ్లు తమ రోల్‌ను బాగానే పోషించినా.. కేవలం 30 నిమిషాల నిడివితో హైపర్ ఆది ఆ ఈవెంట్‌లో సింహభాగాన్ని పోషించాడనడంలో అతిశయోక్తి లేదు.
కేవలం 25 మినట్స్ పాటు సాగిన హైపర్ ఆది ఎపిసోడ్ బాగా పేలిందని చెప్పవచ్చు. ఇందుకోసం స్టార్ మా నిర్వాహకులు ముందుగానే హైపర్ ఆదితో ఒక ఒప్పందం కుదుర్చుకుని.. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాకుండా, బిగ్‌బాస్ షోను రోజు ఫాలో అవ్వాలనే నిబంధన కూడా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ సీజన్ -5లో తీసుకున్న రెమ్యూనరేషన్‌కు ఆది న్యాయం చేశాడని తెలుస్తోంది. కంటెస్టెంట్స్‌పై బాగానే పంచులు వేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే, ఈ సీజన్‌లో హైపర్ ఆది ఏకంగా రూ. 2 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్టు తెలిసింది. అతను వేసిన పంచులు, కామెడీ టైమింగ్ బాగా రావడంతో చివరి ఎపిసోడ్‌కు సైతం హైపర్ ఆదిని పిలువనున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.