
Mahesh Babu
Mahesh : మహేష్ బాబు సక్సస్ లలో ఉన్న దర్శకులతోనే సినిమా చేస్తాడన్న ఒక టాక్ ఉంది. ఈ మాట ఎంతవరకు వాస్తవమో తెలీదు గాని ఆయన గత చిత్రాలన్ని పరిశీలిస్తే మాత్రం నిజమనే అనిపిస్తుంది. ఇక మహేష్ కి కథ లో ఏ చిన్న క్లారిటీ మిస్ అయినా కూడా ససేమిరా అంటాడు. ఇక ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేస్తాడు. తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడిని కూడా అలానే పక్కన పెట్టాడు. ఒకరిని కాదు ఇద్దరిని అని చెప్పొచ్చు. ఒకరు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. మరొకరు వంశీ పైడిపల్లి. మహేష్‌తో పూరి హ్యాట్రిక్ సినిమాగా జనగణమన చేయాలనుకున్నాడు.
if-mahesh-says-no-then-he-went-to-megastar
కానీ మహేష్‌కి కథ నచ్చక నో అన్నాడట. ఆ తర్వాత పూరికి వరసగా ఫ్లాపులొచ్చాయి. దాంతో మళ్ళీ పూరికి మహేష్ ఛాన్స్ ఇవ్వలేదనేది టాక్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత కూడా పూరి డైరెక్ట్‌గానే మహేష్ సక్సస్‌లలో ఉంటేనే సినిమా చేస్తాడని ఓపెన్ అయిపోయాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడుంటుందో చూడాలి. ఇక వంశీ పైడిపల్లి మహేష్ బాబుకి మహర్షి రూపంలో భారీ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో మరో సినిమా ఉంటుందని ప్రకటన కూడా వచ్చింది. నిర్మాత దిల్ రాజు.
గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వాస్తవంగా అయితే వంశీ పైడిపల్లి సినిమా మహేష్ బాబుతోనే ఉండాలి. కానీ ఆఖరి నిముషంలో మహేష్ ఈ ప్రాజెక్ట్‌కి నో అనేశాడు. అప్పటి నుంచి వంశీ పైడిపల్లి ఏ హీరోతో సినిమా అవకాశం రాలేదు. అయితే తాజాగా మెగాస్టార్‌కి వంశీ పైడిపల్లి కథ చెప్పినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ రేంజ్‌కి తగ్గట్టు కథ సిద్దం చేసి కలిశాడట. త్వరలో మెగస్టార్‌కి వంశీ పైడిపల్లి కథ చెప్పనున్నట్టు సమాచారం. ఇంతకముందు వంశీ పైడిపల్లి నాగార్జున – కార్తిలతో ఊపిరి సినిమా తీసి హిట్ కొట్టాడు. మరి మెగాస్టార్‌తో ప్రాజెక్ట్ ఒకే అవుతుందా లేదా చూడాలి.
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
Bus Accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు శివారులోని చిన్నటేకూరు…
Curd | పెరుగు మన ఆహారంలో ఓ ముఖ్యమైన భాగం. ఇది రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు…
Apple | రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అన్న నానుడి కేవలం మాట కాదు,…
Liquor | నేటి కాలంలో చాలామందికి ఆకలిగా ఉన్నప్పుడే మద్యం తాగే అలవాటు ఉంది. ఇది సరదాగా అనిపించినా, శరీరానికి ప్రమాదకరమని…
Chanakya | మహానీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విలువైన సూత్రాలను…
This website uses cookies.