Mahesh : మహేష్ పక్కన పెడితే మెగాస్టార్ దగ్గరకు వెళ్ళాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh : మహేష్ పక్కన పెడితే మెగాస్టార్ దగ్గరకు వెళ్ళాడా..?

 Authored By govind | The Telugu News | Updated on :20 April 2021,11:33 am

Mahesh : మహేష్ బాబు సక్సస్ లలో ఉన్న దర్శకులతోనే సినిమా చేస్తాడన్న ఒక టాక్ ఉంది. ఈ మాట ఎంతవరకు వాస్తవమో తెలీదు గాని ఆయన గత చిత్రాలన్ని పరిశీలిస్తే మాత్రం నిజమనే అనిపిస్తుంది. ఇక మహేష్ కి కథ లో ఏ చిన్న క్లారిటీ మిస్ అయినా కూడా ససేమిరా అంటాడు. ఇక ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేస్తాడు. తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడిని కూడా అలానే పక్కన పెట్టాడు. ఒకరిని కాదు ఇద్దరిని అని చెప్పొచ్చు. ఒకరు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. మరొకరు వంశీ పైడిపల్లి. మహేష్‌తో పూరి హ్యాట్రిక్ సినిమాగా జనగణమన చేయాలనుకున్నాడు.

if mahesh says no then he went to megastar

if-mahesh-says-no-then-he-went-to-megastar

కానీ మహేష్‌కి కథ నచ్చక నో అన్నాడట. ఆ తర్వాత పూరికి వరసగా ఫ్లాపులొచ్చాయి. దాంతో మళ్ళీ పూరికి మహేష్ ఛాన్స్ ఇవ్వలేదనేది టాక్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత కూడా పూరి డైరెక్ట్‌గానే మహేష్ సక్సస్‌లలో ఉంటేనే సినిమా చేస్తాడని ఓపెన్ అయిపోయాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడుంటుందో చూడాలి. ఇక వంశీ పైడిపల్లి మహేష్ బాబుకి మహర్షి రూపంలో భారీ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో మరో సినిమా ఉంటుందని ప్రకటన కూడా వచ్చింది. నిర్మాత దిల్ రాజు.

Mahesh : మహేష్ తోనే వంశీ పైడిపల్లి సినిమా ఉండాలి..!

గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వాస్తవంగా అయితే వంశీ పైడిపల్లి సినిమా మహేష్ బాబుతోనే ఉండాలి. కానీ ఆఖరి నిముషంలో మహేష్ ఈ ప్రాజెక్ట్‌కి నో అనేశాడు. అప్పటి నుంచి వంశీ పైడిపల్లి ఏ హీరోతో సినిమా అవకాశం రాలేదు. అయితే తాజాగా మెగాస్టార్‌కి వంశీ పైడిపల్లి కథ చెప్పినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ రేంజ్‌కి తగ్గట్టు కథ సిద్దం చేసి కలిశాడట. త్వరలో మెగస్టార్‌కి వంశీ పైడిపల్లి కథ చెప్పనున్నట్టు సమాచారం. ఇంతకముందు వంశీ పైడిపల్లి నాగార్జున – కార్తిలతో ఊపిరి సినిమా తీసి హిట్ కొట్టాడు. మరి మెగాస్టార్‌తో ప్రాజెక్ట్ ఒకే అవుతుందా లేదా చూడాలి.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది