Ileana : ఇలియానా ఈ కొత్త బిజినెస్ ఏంటీ..?

Authored By vamana sai | The Telugu News | Updated on : 16 May 2021, 1:10 pm

Ileana : ఇలియానా Ileana టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ‘దేవదాసు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ ‘పోకిరి’ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్‌లో వరసగా స్టార్ హీరోలతో, దర్శకులతో పని చేసి ఎన్నో బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇలియానా బెల్లీ డాన్స్‌కు దేశం మొత్తం ఊగిపోయిందంటే ఆమె నడుమందాలకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే దర్శకులు, డాన్స్ మాస్టర్స్ ఇలియానా కోసం ప్రతీ సినిమాలో తప్పకుండా ఓ బెల్లీ డాన్స్ మూవ్ మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తారు.

ఇంతటి క్రేజ్ ఉన్న ఇలియానా ఒక్కసారిగా టాలీవుడ్ లో ఫేడవుట్ అయిపోయింది. కానీ బాలీవుడ్‌లో మాత్రం అమ్మడికి తిరుగు లేదన్నట్టుగా నెమ్మదిగా ఒక్కో సినిమా చేస్తూ వస్తోంది. గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి ముందు నుంచి రెడీగా ఉంది కాబట్టి నార్త్ ఫ్యాన్స్ బాగా ఇల్లీ బేబీ అంటే పడి చచ్చిపోతుంటారు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ లాంటి స్టార్ ఈ బ్యూటీకి కాస్త సపొర్ట్ చేస్తూ తన బ్యానర్ లో నిర్మించే సినిమాలలో అవకాశాలిస్తున్నాడు. అయినా కూడా మన గోవా సుందరి Ileana టాలీవుడ్ మీద ఇంట్రెస్ట్ బాగానే పెట్టింది.

ileana- new business starting soon

ileana- new business starting soon

Ileana : ఇలియానా ఈ బిజినెస్‌కు తన పేరే పెట్టనుందట.

కానీ ఇక్కడి మెకర్స్ ఎవరూ ఇల్లీ బేబీని పట్టించుకోవడం లేదు. దాంతో సొంతగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటుంది ఇలియానా. కరోనా క్రైసిస్ అని తెలినా కూడా ఇంత ధైర్యం ఎందుకు చేస్తుందో గానీ స్వీట్స్ అండ్ బేకరీ చెయిన్ బిజినెస్ ప్రారంభించనుందట. లాక్ డౌన్ ముగిసిన తర్వాత రెస్టారెంట్లకి సంబంధించిన చైన్ బిజినెస్‌ను మొదలు పెట్టబోతుందట. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ బిజినెస్‌కు తన పేరే పెట్టనుంది. ఇప్పటికే పలువురు తారలు హీరోయిన్స్ గా కొనసాగుతూనే రక రకాల వ్యాపార రంగాలలో స్థిరపడుతున్నారు. ఇలియానా కాస్త లేటయిందంతే.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp