
Indian 2 Movie : ఇండియన్ 2 రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. ఎప్పుడు రిలీజ్ కానుంది అంటే..!
Indian 2 Movie : లోకనాయకుడు కమల్ హాసన్ సూపర్ హిట్ చిత్రాలలో భారతీయుడు ఒకటి. ఈ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సోషల్ మెసేజ్ మూవీ ‘భారతీయుడు’ సినిమా ఇప్పుడు థియేటర్స్‌లో వస్తున్నా కూడా ఫ్యాన్స్ ఈ సినిమాని ఆసక్తిగా చూస్తుంటారు.అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ఇండియన్ 2, ఇండియన్ 3 టైటిల్స్ తో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్టుప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అయితే ఈ మూవీ గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే ఈ సినిమా ఆగిందనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్న సమయంలో మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ కచ్చితమైన డేట్ ని అనౌన్స్ చేయలేదు కాని జూన్ నెలలో చిత్రం రిలీజ్ కానుందని మాత్రం అఫీషియల్‌గా ప్రకటించారు. ఇండియన్ 2 మూవీ తెలుగు, తమిళ్, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. మూవీలో కమల్‌తో పాటు కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్, సముద్రగని, బాబీ సింహా వంటి పలువురు నటించారు. ఈ మూవీ తొలి భాగానికి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించగా, రెండో భాగానికి అనిరుధ్ రవిచంద్రన్ బాణీలు అందిస్తున్నారు.
Indian 2 Movie : ఇండియన్ 2 రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. ఎప్పుడు రిలీజ్ కానుంది అంటే..!
చిత్రీకరణ పూర్తి చేసుకుని తుది దశ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేసుకున్నఈ మూవీ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సేనాపతి తిరిగి వచ్చేస్తున్నాడు.. సిద్ధంగా ఉండండి! జూన్‍లో ఇండియన్ 2 తుఫానుకు అంతా సిద్ధమైంది. ఈ ఎపిక్ మూవీ కోసం మీ క్యాలెండర్లలో మార్క్ చేసి పెట్టుకోండి” అంటూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియజేసింది. ఈ నెల 19వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే, పొరుగు రాష్ట్రాల్లో మే లో రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఇవన్నీ ముగిసిన తర్వాతే మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.