
KCR : చంద్రబాబు ఒక మూర్ఖుడు... వాడి వలనే ఇదంతా... బాబుపై కేసీఆర్ కామెంట్స్...!
KCR : తాజాగా తెలంగాణ రాష్ట్రంలోమీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ పై అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్ మాట్లాడుతూ…65 ఏళ్ల స్వతంత్ర భారతంలో చావకండి అంటూ గోడలపై రాస్తున్నా ప్రభుత్వాలని చూస్తున్నాం ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాగైనా సరే చేనేత కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో ఓ ప్రణాళిక సిద్ధం చేశాం. గతంలో సిరిసిల్ల జిల్లాలో ఒకేసారి 11మంది కార్మికుల చనిపోతే అక్కడ మరోసారి అలాంటి పరిస్థితులు జరగకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకున్నాం.
ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేసాం. ఇప్పటికీ కూడా ఆ ట్రస్ట్ సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఆ సమయంలో వారికి తెలంగాణ కచ్చితంగా వస్తుందని భరోసా ఇచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత మిమ్మల్ని కచ్చితంగా మా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలియజేశారు. ఇక అప్పుడు అనుకున్న ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. రెండు రకాల సంక్షేమ పథకాల ద్వారా వారికి ఉపాధి కల్పించాం.అయితే చంద్రబాబు నాయుడు అనే మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకేసారి ఏడుగురు చేనేత కార్మికులు మరణించారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడుకు నేను దండం పెట్టి కనీసం 50,000 ఇన్సూరెన్స్ ఇవ్వండి అని అడిగితే ఆ దుర్మార్గుడు ఇవ్వలేదంటూ కేసీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఆ సమయంలో నేను భిక్షాటన చేసి దానిలో వచ్చిన 7 లక్షల రూపాయలని తీసుకెళ్లి పోచంపల్లిలో చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాం.
KCR : చంద్రబాబు ఒక మూర్ఖుడు… వాడి వలనే ఇదంతా… బాబుపై కేసీఆర్ కామెంట్స్…!
ఆ విధంగా భువనగిరిలో , ,గద్వాలలో, దుబ్బాకలో సిరిసిల్లలో ప్రతిరోజు చనిపోయే చేనేత కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం వారికి మేలు జరిగే విధంగా కొన్ని పథకాలు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే వారికి ఉపాధి కల్పించే దిశగా స్కూల్ యూనిఫామ్ లు , బతుకమ్మ చీరలు , ముస్లిం సోదరులకు బట్టలు అందించే విధంగా అవన్నీ ఆర్డర్స్ ఆ చేనేత కార్మికులకు అందించడం జరిగింది. ఆ విధంగా చేనేత కార్మికులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రోజులను తీసుకువచ్చిందంటూ కేసీఆర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులను అవమానించేలా వ్యవహరిస్తుందంటూ తెలియజేశారు. ఎన్నికల ముందు ఏవైతే ఇస్తామని హామీ ఇచ్చారో అవన్నీ ఇవ్వాల్సిందిగా కోరారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.