Indraja : ఇంద్రజ పెళ్లికి అంత ఖర్చయిందా?.. అసలు విషయం చెప్పేసిందిగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Indraja : ఇంద్రజ పెళ్లికి అంత ఖర్చయిందా?.. అసలు విషయం చెప్పేసిందిగా

 Authored By prabhas | The Telugu News | Updated on :17 July 2022,12:30 pm

Indraja : బుల్లితెరపై ప్రస్తుతం ఇంద్రజ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇంద్రజ మొత్తానికి రోజా స్థానాన్ని భర్తీ చేసేసింది. రోజాది కాస్త అతి అనిపించినా.. ఇంద్రజది మాత్రం ఎక్కడా కూడా అలా అనిపించదు. ఇంద్రజ ఎంతో న్యాచురల్‌గా మాట్లాడుతుంది.. అంతకంటే సహజంగా నవ్వుతుంది. ఇంద్రజకు రోజురోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. మొత్తానికి జబర్దస్త్ షోను ఇంద్రజ బాగానే నెట్టుకొస్తుంది. శ్రీదేవీ డ్రామా కంపెనీని ఇంద్రజ వదిలేసినా కూడా ఇక్కడ సెట్ అయింది. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో ఓ విషయం బయటకు వచ్చింది.

వెంకీ మంకీ మొదటి సారిగా తన టీంలోకి తన రియల్ భార్యను తీసుకొచ్చాడు.తన భార్యతో కలిసి స్కిట్లు వేశాడు. అనంతరం వారిద్దరి ప్రేమ కథను ఇంద్రజ అడిగింది. దీంతో స్టేజ్ మీద తన లవ్ స్టోరీని చెప్పేశాడు వెంకీ మంకీ. తాను మిమిక్రీ ఆర్టిస్ట్‌ని అని, ఆమె కూచిపూడి డ్యాన్సర్.. ముందు తానే ఆమెకు ప్రపోజ్ చేశానంటూ ఇలా చెప్పుకొచ్చాడు. అయితే అనంతరం అతని భార్య మోకాళ్ల మీద నిల్చుని, రోజా పువ్వు ఇచ్చి మరీ ప్రపోజ్ చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే వెంకీ దొరికిందే చాన్స్ అనుకుని ఇంద్రజను కూడా అడిగేశాడు.

Indraja About Her Marrriage in Latest Jabardasth Promo

Indraja About Her Marrriage in Latest Jabardasth Promo

మీది లవ్ మ్యారేజా? మేడం అని అన్నాడు. ఇక ఇంద్రజ సిగ్గుపడుతూ అసలు విషయాన్ని చెప్పింది. తన పెళ్లికి కేవలం పదమూడు మంది మాత్రమే వచ్చారని, తన పెళ్లికి కేవలం రూ. 7500 మాత్రమే ఖర్చు అయిందని చెప్పుకొచ్చింది. సెలెబ్రిటీల పెళ్లిళ్లు అంటే ఎన్ని కోట్లు ఖర్చవుతాయో అందరికీ తెలిసిందే. కానీ ఇంద్రజ మాత్రం తన పెళ్లిని ఎంతో సింపుల్‌గా చేసేసుకుంది. అలా మొత్తానికి ఇంద్రజ తన పెళ్లి గురించి, దాని ఖర్చు గురించి చెప్పేసింది. ఇక అనసూయను ఇంద్రజ ఇలా అడిగింది. మరీ నీ పెళ్లి అని ఇంద్రజ అడగడంతో.. నాది అంతా కూడా తెరిచిన పుస్తకమే అని అనసూయ అనేసింది. ఎన్‌సీసీ క్యాంప్ లవ్ స్టోరీ, ఇంట్లోంచి బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవడం, మళ్లీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం మరోసారి పెళ్లి చేయడం అందరికీ తెలిసిందే.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది