Indraja : ఆ ప‌ని ఇష్టం ఉండి ఎవ‌రు చేస్తారు.. నాగార్జున‌తో ఆ విష‌యంపై మాట్లాడితే లేనిపోని గొడ‌వ‌లు..!

Authored By Sam C | The Telugu News | Published on: August 16, 2022, 5:40 pm

Indraja : ఇంద్ర‌జ‌..ఈమె ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుని ఓ ఊపు ఊపేసిన విష‌యం తెలిసిందే. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన ఇంద్ర‌జ ఇటీవ‌ల త‌న పెళ్లి గురించి చెప్పుకొచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ‘మా పెళ్లికి వచ్చింది 13 మంది.. ఓన్లీ రూ. 7,500 మాత్రమే ఖర్చు అయ్యింది’ అని తన సింపుల్ మ్యారేజ్ గురించి చెప్పుకొచ్చింది ఇంద్రజ. ఇంద్రజ భర్త కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. రైటర్, యాడ్ ఫిల్మ్ మేకర్.. సీరియల్స్ కూడా చేశారు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి పెద్ద టైం పట్టలేదు. పైగా రెండు కుటుంబాల మధ్య బిజినెస్ డీల్స్ కూడా ఉండటంతో ఎఫెక్షన్ బాగా కుదిరింది.

Indraja : షాకింగ్ వ్యాఖ్య‌లు..

అయితే పెళ్లి త‌ర్వాత సినిమాలు త‌గ్గించిన ఇంద్ర‌జ ఇప్పుడు సెల‌క్టివ్‌గా సినిమాలు చేస్తూనే జడ్జిగా వ్య‌వ‌హ‌రిస్తుంది. అయితే ఆ నాటి సంగ‌తుల‌కి సంబంధించి ప‌లు విష‌యాలు చెప్పుకొస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అప్ప‌ట్లో నాగార్జున సరసన కన్నెపిట్టరో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసి అలరించింది. అలాగే ఓ తమిళ సినిమా లో కూడా ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. వీటి గురించి తాజాగా స్పందిస్తూ “నిజానికి అలాంటి సాంగ్స్ చేయాలని ఏ హీరోయిన్ కి ఉండదు. పెద్ద వాళ్ల రిక్వెస్టుపైనే ఎక్కువగా చేస్తాం. పెద్ద బ్యానర్‌ అడిగినప్పుడు మనం నో చెప్పితే.. బాగుండదు. పెద్ద బ్యానర్ కదా అనే చాలా మంది ఒప్పుకోవాల్సి వస్తుంది.

indraja comments on nagarjuna

indraja comments on nagarjuna

నేను ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశాను. వాటి గురించి ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా లేనిపోని వివాదాలు వస్తాయి. అందుకే వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువగా మాట్లాడను..” అని చెప్పుకొచ్చింది. పెద్ద బ్యాన‌ర్ల బ‌ల‌వంతం వ‌ల్ల‌నే తాను చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్ప‌క‌నే చెప్పింది. కాగా, ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కూడా.. బ్రాహ్మిణ్‌గా ఉంది ఇంద్రజ. ‘‘ నేను నా మనసుకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.. అతను హిందు.. ముస్లిం అని చూడలేదు.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదు. మతాలతో సంబంధం లేకుండా ఒకర్నొకరు ఇష్టపడ్డాం.. మతం చూసి, కులం చూసి ఇష్టపడితే అది ప్రేమ ఎలా అవుతుంది అని అంటుంది.

Sam C

No bio available for this author.

  1. "KCR Ys Jagan : ఆనాడు జగన్‌కు కేసీఆర్ నేరుగా ఇచ్చిన వార్నింగ్ ఇదే.. హరీష్ రావు బయటపెట్టిన షాకింగ్ నిజం..!"

  2. "PM KMY Scheme : నెలకు రూ.55 కడితే రూ.3,000 పెన్షన్.. రైతులకు కేంద్రం పథకం.. ఎలా అప్లై చేయాలి?"

  3. "Gudivada Politics : గుడివాడలో అగ్గి రాజుకుంటోంది.. కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి ఖాయమా..?!"

  4. "Dimple Hayathi : శర్వానంద్‌తో పెళ్లి వార్తలపై డింపుల్ హయాతి క్లారిటీ..!"

  5. "Gold Rate Today : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. . నేటి రేట్లివే!"

  6. "Narendra Modi : ఏకంగా ఆ స్థాయికి చేరుకున్న మోదీ.. ఈ లెక్కలు చూస్తే రాహుల్‌కు నిద్ర పట్టదు..!"

  7. "YS Jagan Ys sharmila : తల్లి, చెల్లి రోడ్డుమీద పడటానికి కారణం ఆయనేనట.. యలహంక ప్యాలెస్ రచ్చలో సరికొత్త ట్విస్ట్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp