Prabahs : నెల గ్యాప్‌తో ప్ర‌భాస్ రెండు సినిమాలు.. ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన అశ్వినీదత్

Authored By Sam C | The Telugu News | Published on: August 16, 2022, 5:20 pm

Prabahs : ప్ర‌భాస్ సినిమాల‌పై ప్రేక్ష‌కుల‌లో ఎంత‌టి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాధే శ్యామ్ సినిమా త‌ర్వాత ఆయ‌న సినిమాకి సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు పెద్ద‌గా రాలేదు. ఇండిపెండ‌న్స్ డే సంద‌ర్భంగా స‌లార్ అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇది. ‘కేజీఎఫ్’ను తెరకెక్కించిన హొంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైనింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ విలన్ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్ర‌భాస్ న‌టించే క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ప్రాజెక్ట్ కె కూడా ఒక‌టి. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది.రెబల్ స్టార్ ప్రభాస్ , నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అంతేకాదు ఈ చిత్రాన్ని 2023 జనవరి వరకు టాకీ పార్ట్ కంప్లీట్ చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమాను అక్టోబర్ 18న ప్రభాస్ బర్త్ డే వీక్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు చిత్ర నిర్మాత అశ్వనీదత్ ప్రకటించారు.

Prabahs comes with 2 movies in 2023

Prabahs comes with 2 movies in 2023

తాజాగా ఆలీతో స‌ర‌దాగా షోలో పాల్గొన్న అశ్వినీ ద‌త్ ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్ర‌భాస్ బ‌ర్త్ డే పాటు ద‌స‌రా రెండు చూసుకొని విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలిపారు. ప్రియాంకా ద‌త్, స్వ‌ప్పా ద‌త్ ఇద్ద‌రు కూడా సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని అశ్విని ద‌త్ అన్నారు. ప్యాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ఇతరత్రా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు చాలా సమయం కావాలి. అందుకే ఈ సినిమా షూట్ కంప్లీటైన 10 నెలల తర్వాత ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఏదేమైన సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ నెల‌లో ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తుండ‌డం విశేషం.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp