Jabardasth Varsha : లేడీ జడ్జ్‌ల డామినేషన్.. వర్ష, ఫైమా విషయంలో వెనక్కి తగ్గిన ఇమాన్యుయేల్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 15 May 2022, 11:00 am

Jabardasth Varsha : బుల్లితెరపై ఇమాన్యుయేల్ ఇప్పుడు మంచి కమెడియన్‌గా పేరు సంపాదించుకున్నాడు. వర్షతో కొన్ని రోజులు రొమాంటిక్ ట్రాక్ నడిపించాడు. మల్లెమాల టీం కూడా ఆ జోడిని బాగానే ఎంకరేజ్ చేసింది. చివరకు ఈ జోడికి పెళ్లి ఈవెంట్ కూడా చేసింది. ఆ స్కిట్, ఆ ఈవెంట్‌తో జనాలు ఇమాన్యుయేల్, వర్షను దూరంపెట్టడం ప్రారంభించారు. ఇలా ఇంకెన్ని సార్లు చేస్తారంటూ ఫైర్ అయ్యారు. గతంలో టీఆర్పీల కోసం సుధీర్ రష్మీ పెళ్లి, ఎంగేజ్మెంట్ ఈవెంట్లు చేశారు. పండుగలకు ఇలా చేసి టీఆర్పీలు రాబట్టుకోవడం మల్లెమాలకు అలవాటైంది.

అలానే ఇమాన్యుయేల్, వర్షల మీద కూడా ఈవెంట్ చేశారు. ఇక దాన్ని వర్ష మరింతగా ప్రమోట్ చేసుకుంది. తన సోషల్ మీడియా ఖాతాల్లో తనకు నిశ్చితార్థం అయిందన్నట్టుగా ప్రచారం చేసుకుంది. తీరా చూస్తే అది పండుగ ఈవెంట్ కోసం చేసిన స్కిట్ అని అందరికీ అర్థమైంది. మొత్తానికి వర్ష, ఇమాన్యుయేల్ జోడి మాత్రం అలా పడుతూ లేస్తూ ముందుకు వెళ్తోంది. ఇక ఈ మధ్య ఫైమాతోనూ బాగానే సెట్ అవుతోంది. ఫైమా, వర్ష, ఇమాన్యుయేల్ ఈ ముగ్గురూ కలిసి స్కిట్ వేస్తే అదిరిపోతోంది.బుల్లెట్ భాస్కర్ టీంలో ఈ ముగ్గురు చేరిపోయారు. అలా ఈ నలుగురు కలిసి వేస్తోన్న స్కిట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Indraja Poorna Satires On Jabardasth Emmanuel About Varsha ANd Faima

Indraja Poorna Satires On Jabardasth Emmanuel About Varsha ANd Faima

ఒకరినొకరు తెగ బాదుకుంటూ ఉంటారు. వర్ష, ఫైమాలను ఇమాన్యుయేల్ ఉతికి ఆరేస్తుంటాడు. ఇక ఇమాన్యుయేల్‌ను ఫైమా అయితే ఓ రేంజ్‌లో కొడుతూ ఉంటుంది. అందరూ కలిసి బుల్లెట్ భాస్కర్‌ను కూడా కొడుతుంటారు. అయితే తాజాగా వేసిన స్కిట్లో ఇమాన్యుయేల్‌కు తెగ నిబంధనలు పెట్టినట్టున్నారు. దీంతో ఇమాన్యుయేల్ ఏం చేయలేని స్థితికి వచ్చేశాడు.వర్షను లేడీ గెటప్, మగాడు అని అనొద్దని కండీషన్ పెట్టారు. ఫైమాను కొట్టొద్దు అని కూడా కండీషన్ పెట్టినట్టున్నాడు. లేడీ జడ్జ్‌లే ఉన్నారు కాస్త చూసుకోరా అని భాస్కర్ అంటే.. అందుకే అప్పటి నుంచి కొట్టకుండా.. కొట్టినట్టు నటిస్తున్నాను అని ఇమాన్యుయేల్ అనేస్తాడు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి