Indraja : ఇంద్రజలో ఇంత టాలెంట్ ఉందా?.. దెబ్బకు అంతా ఫిదా

 Authored By prabhas | The Telugu News | Updated on :31 March 2022,5:30 pm

Indraja : ఇంద్రజ ఒకప్పుడు సినిమాలతో ఫేమస్. కానీ ఇప్పుడు బుల్లితెరపై షోలతో ఫేమస్ అవుతోంది. అప్పుడెప్పుడో అలా జబర్దస్త్ షోలో కనిపించింది. ఆ మధ్య రోజా హెల్త్ బాగా లేకపోవడంతో కొంత మంది కొత్త వాళ్లను తీసుకొచ్చి జడ్జ్ స్థానంలో పెట్టేశారు. అందులో ఎంతో మంది వచ్చారు పోయారు. కానీ ఇంద్రజ మాత్రం అందరి మనసులో ముద్ర వేసింది.

తన నవ్వుతో అందరినీ కట్టి పడేసింది. దీంతో రోజా వద్దు ఇంద్రజ ముద్దు అనే వరకు వ్యవహారం వెళ్లింది. దీంతో ఇంద్రజను తీసుకొచ్చి శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు జడ్జ్‌గా పెట్టేసింది. అక్కడ ఇంద్రజ తన హవాను కొనసాగిస్తోంది. అయితే ఇంద్రజలో ఓ టాలెంట్ దాగి ఉంది. ఆమె ఎంత అందంగా ఉంటుందో.. ఆమె గాత్రం కూడా అంతే అందంగా ఉంటుంది.

Indraja Singing SOng In Sridevi Drama Company

Indraja Singing SOng In Sridevi Drama Company

Indraja : పాట పాడిన ఇంద్రజ..

ఇంద్రజలో ఓ మంచి సింగర్ దాగి ఉంది. ఆ విషయాన్ని అప్పుడప్పుడు బయటకు రానిస్తుంటుంది. అయితే తాజాగా పూర్తి స్థాయిలో తనలోని గాయకురాలిని బయటకు తీసుకొచ్చింది. తాజాగా వదిలిన ప్రోమోలో ఇంద్రజ పాట పాడింది. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అని అందంగా పాడి అందరినీ మెప్పించింది. ఒక్కసారిగా వేరే లోకంలోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి