Sridevi Drama Company Jhansi : పల్సర్ బండి ఝాన్సీ కి ఎందుకు ఇంత క్రేజ్.. అసలు విషయం ఇదే!
Sridevi Drama Company Jhansi : ప్రస్తుతం సోషల్ మీడియాలో పల్సర్ బండి ఝాన్సీ అలియాస్ కండక్టర్ ఝాన్సీ పేరు తెగ వినిపిస్తోంది.. కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆమె వీడియోలు సందడి చేస్తున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ లో పల్సర్ బండి పాటకి ఆమె వేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియా ని కుదిపేస్తున్నాయి. ఇదే సమయంలో ఆమె గతంలో స్టేజ్ పై చేసిన డాన్సులు.. ఇతర వీడియోలు కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంతో మంది డాన్సర్స్ వచ్చారు. ఎంతో మంది కొత్త టాలెంట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి పై సందడి చేశారు. కానీ వారు ఎవ్వరికి రాని గుర్తింపు, వారెవ్వరు ఓవర్ నైట్ లో దక్కించుకోలేని స్టార్డం కేవలం కండక్టర్ ఝాన్సీ కి మాత్రమే దక్కింది.
ఝాన్సీకే ఎందుకు ఇంతగా జనాలు అభిమానంను చూపిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ విషయంపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది ఈ ఝాన్సీ శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన డాన్స్ సూపర్ గా ఉండడం వల్ల మంచి పేరు దక్కించుకుంది అంటున్నారు. కొందరు మాత్రం ఆమె డాన్స్ మాత్రమే కాకుండా ఆమె ఒక ఆర్టీసీ కండక్టర్ అని చెప్పడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక పెళ్లి అయినా మహిళ అది కూడా ఒక లేడీ కండక్టర్ ఇలా స్టేజి షోలు చేయడమేంటి అంటూ అంతా యూట్యూబ్లో కండక్టర్ ఝాన్సీ గురించి వెతకడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్ లో మారిమోగుతుంది.
అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడ సోషల్ మీడియాలో చూసిన ఆమె పేరు మరియు వీడియోలే కనిపిస్తున్నాయి. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఆమె తండ్రి ఒక కానిస్టేబుల్. చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆమె భావించింది. అదే సమయంలో డాన్స్ పై కూడా మక్కువ పెంచుకుంది. ఇంటర్ లోనే ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె భర్త కూడా డాన్సర్ అవ్వడంతో ఆమెను ప్రోత్సహించాడు. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఆమెపై గౌరవాన్ని పెంచుతున్నాయి. అలాగే ఆమెపై అభిమానంను పెంచుతున్నాయి. కనుక ఆమె కు ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఏర్పడింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.