Anushka Shetty : అనుష్కకి పెళ్లి అవసరం లేదు కానీ తల్లి కావాలనుకుంటుందా ..??

Advertisement

Anushka Shetty : బ్యూటిఫుల్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగలిగే అనుష్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి సినిమా తర్వాత అనుష్కకి పెద్ద పెద్ద ఆఫర్లు వస్తాయి అనుకుంటే ఆమె చాలా సైలెంట్ అయిపోయారు. అయితే బాలీవుడ్ లో అనుష్కకి అవకాశాలు వచ్చిన ఆమె వెళ్లలేదని సమాచారం. సినిమాలో ఎలా ఉన్నా బయట చాలా పద్ధతిగా కనిపించే అనుష్క బాలీవుడ్ వైపు అడుగులు వేయాలనుకోలేదట. అందుకే వచ్చిన సినిమాతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు.

Advertisement

అయితే అనుష్క పెళ్లి చేసుకోదు కానీ తల్లి మాత్రం అవ్వాలనుకుంటుందట. అనుష్క అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి కాకుండా అనుష్క తల్లి కావాలనుకుంటుంది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. ప్రస్తుతం అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా విడుదలై మంచి పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది.

Advertisement
Miss Shetty Mr Polishetty trailer Interesting news about Anushka Shetty
Miss Shetty Mr Polishetty trailer Interesting news about Anushka Shetty

అయితే ఈ సినిమాలో అనుష్క శెట్టికి ప్రేమ, పెళ్లి మీద నమ్మకం ఉండదు. అలాగే ఇష్టం కూడా ఉండదు. కానీ తల్లి అవ్వాలనే కోరిక మాత్రం ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు నవీన్ పోలిశెట్టి కలుస్తాడు. నవీన్ తన కోరిక తీర్చుతాడని అనుకుంటుంది. అయితే ఆమెకు ప్రేమ పెళ్లి పై నమ్మకం లేదని, తల్లి అవ్వాలని కోరిక ఉంటుంది. మరి తనకు ఎదురైన నవీన్ తో కలిసిపోయి అనుష్క బిడ్డకు జన్మనిస్తుందా.. ఆ తర్వాత సినిమాలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. విభిన్నమైన కథతో మన ముందుకు రాబోతున్న ఈ సినిమాను మహేష్ బాబు దర్శకత్వం వహించారు. నిశ్శబ్దం సినిమా తర్వాత రాబోతున్న ఈ సినిమాపై అనుష్క అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Advertisement
Advertisement