Chiranjeevi : రెండోసారి కూడా పెద్ద తప్పు చేయబోతున్న చిరంజీవి .. ఆందోళనలో మెగా ఫ్యాన్స్ .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : రెండోసారి కూడా పెద్ద తప్పు చేయబోతున్న చిరంజీవి .. ఆందోళనలో మెగా ఫ్యాన్స్ ..

Chiranjeevi : మెగాస్టార్ గత సినిమా ‘ భోళాశంకర్ ‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా విడుదలైన సమయంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘ జైలర్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ కొల్లగొట్టారు. అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిన జైలర్ సినిమా ముందుగా చిరంజీవి వద్దకు వచ్చిందట. జైలర్ దర్శకుడు నెల్సన్ కుమార్ ఈ కథను ముందుగా చిరంజీవికి చెప్పారట. […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 September 2023,11:00 am

Chiranjeevi : మెగాస్టార్ గత సినిమా ‘ భోళాశంకర్ ‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా విడుదలైన సమయంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘ జైలర్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ కొల్లగొట్టారు. అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిన జైలర్ సినిమా ముందుగా చిరంజీవి వద్దకు వచ్చిందట. జైలర్ దర్శకుడు నెల్సన్ కుమార్ ఈ కథను ముందుగా చిరంజీవికి చెప్పారట. ‘ బీస్ట్​ ‘ సినిమా షూటింగ్​ సమయంలో నెల్సన్​ జైలర్ గురించి నెరేషన్ చేశారట. అయితే ఈ సినిమా లో సాంగ్స్​, డ్యాన్స్​ ఏమీ లేకపోవడం ఆలోచించి చెబుతానని చిరంజీవి అన్నారట.

ఆ తర్వాత బీస్ట్​ సినిమా రిలీజై ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో చిరంజీవి ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టేశారట. తన దగ్గర ఉన్న ఇతర తెలుగు సినిమాల కమింట్ మెంట్ తో ముందుకు వెళ్లారు. ఇక నెల్సన్ రజినీకాంత్ తో జైలర్ తీశారు. అది కాస్త బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుంది. అటు రజినీకాంత్ కి ఇటు నెల్సన్ కి గట్టి కం బ్యాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దర్శకుడు నెల్సన్ హైదరాబాద్ రానున్నారని సమాచారం. ఆయన మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కలవబోతున్నారట. అయితే కథ చెప్పడానికి వస్తున్నారా లేక ఇంకా వేరే పని మీద వస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Interesting news about Megastar Chiranjeevi

Interesting news about Megastar Chiranjeevi

ఒకవేళ ఆయన చెప్పిన చెప్పకపోయినా చిరంజీవి నెల్సన్ ను లైన్లో పెట్టడం మంచిదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రెండోసారి కూడా ఆయన నెల్సన్ తో ఛాన్స్ మిస్ అయితే అది చిరు తప్పే అవుతుంది అని అంటున్నారు. మరీ చిరంజీవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్టతో కలిసి సోషియో ఫాంటసీ సినిమాతో భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. అలాగే ఇంకొకటి తన కూతురితో కలిసి మరో సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. ఈసారి వచ్చే సినిమాతో నైనా చిరంజీవి హిట్ కొట్టాలని అభిమానులు ఆశపడుతున్నారు. మరి చిరంజీవి ఎలాంటి సినిమాను ఎంచుకుంటాడో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది