Intinti Gruhalakshmi 05 Oct Today Episode : అనసూయ అలా చేసినందుకు షాక్ అవుతున్న తులసి… సామ్రాట్ ఏమంటున్నాడంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 05 Oct Today Episode : అనసూయ అలా చేసినందుకు షాక్ అవుతున్న తులసి… సామ్రాట్ ఏమంటున్నాడంటే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 October 2022,9:30 am

Intinti Gruhalakshmi 05 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 755 హైలెట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం… సామ్రాట్ ని అనసూయ నిన్ను నమ్మాలనిపించడం లేదు నిన్ను ఇలా వదిలేస్తే నువ్వు జీవితాంతం ఆలోచించేలా ఉన్నావ్ కాబట్టి నువ్వు చెయ్య లేకపోతే నేనే రంగంలోకి దిగి నా తులసిని రక్షించుకుంటాను అని తనపై కోప్పడుతూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అంతలో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి ఏమైందిరా అనసూయ గారు ఎందుకు నీపై కోప్పడుతున్నారు అని అనగానే ఇప్పుడు కాదులే బాబాయ్ ఆ విషయాలన్నీ నీకు పార్టీ అయిన తర్వాత చెప్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు .సామ్రాట్. నందు లాస్య సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా. అక్కడికి వచ్చి నందిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నందు తనపై చేయి చేసుకోబోతూ ఉండగా..

లాస్య పక్కకు తీసుకెళ్లి నువ్వేం చేస్తున్నావ్ నందు ఇప్పుడు అలా చేస్తే బాగుండదు అని చెప్తూ ఉంటుంది. అంతలో అభి అక్కడికి వచ్చి లాస్య అంటీ చెప్పింది నిజమే డాడీ..  నాయనమ్మ ఇప్పుడు అమ్మని జాబ్ లోంచి తీసేయమని సామ్రాట్ కి చెప్పింది అది జరుగుతోంది మీరు కంగారు పడకండి అని చెప్పగానే అప్పుడు సామ్రాట్ నాయనమ్మ ,తాతయ్యని మీద నాకు నమ్మకం లేదు నువ్వు కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకో మాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సామ్రాట్ హనీ దగ్గరికి వెళ్తాడు. హనీ సామ్రాట్ తీసుకొచ్చిన డ్రెస్ వేసుకొని ఉండగా. తనని చూసి సంతోష పడిపోతూ ఉంటాడు. అప్పుడు తులసి నేను తీసుకొచ్చిన డ్రెస్సు వేస్తే ఎందుకు మీరు మండిపడ్డారు. నేను తీసుకు రావడం మీకు ఇష్టం లేదా.. అని అనగానే లేదా మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పండి సామ్రాట్ గారు అని అడుగుతుంది. అప్పుడు అలా ఏం లేదు అని సామ్రాట్ అంటాడు. అప్పుడు తులసి మీ ముఖం చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. అని అనగానే నేనేం చెప్పినా నమ్ముతారా మీరు అని అంటాడు సామ్రాట్ అప్పుడు తులసి మీ మీద అంత నమ్మకం ఉంది నాకు అని అంటుంది.

intinti gruhalakshmi 05 october 2022 full episode

intinti gruhalakshmi 05 october 2022 full episode

అప్పుడు సామ్రాట్ తులసికి ఒక అబద్ధం చెప్పి అక్కడి నుంచి హనీ ని తీసుకొని ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు.అలా వాళ్ళిద్దర్నీ చూసిన లాస్య తులసి సామ్రాట్లని మాటలంటూ ఉంటుంది. ఇక సామ్రాట్ హనీ ని కేక్ కట్ చేయమనగాని.. ఆగండి నాన్న నేను తులసి ఆంటీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనగానే.. తులసి నాకు గిఫ్ట్ ఏంటమ్మా నీ పుట్టినరోజు అని అనగానే అని మీరు నా మ్యూజిక్ టీచర్ కదా అందుకే మీ కోసం నేను ఒక పాటని పాడుతాను అని చెప్పి పాట పాడుతుంది. అలా పాడడం అయిపోయిన తర్వాత హాని మీరిద్దరూ కలిసి నాతో కేక్ కట్ చేయించండి అని చెప్పగానే వాళ్ళిద్దరూ కలిసి కేక్ కట్ చేయిస్తారు. అలా చేస్తూ ఉండగా లాస్య మండి పడిపోతూ ఉంటుంది. కేక్ కటింగ్ అయిపోగానే సామ్రాట్ నందుని పిలిచి మీరు 10 కోట్ల ప్రాజెక్ట్ ని కాపాడినందుకు మిమ్మల్ని నమ్మి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను.

అంటూ మిమ్మల్ని తులసి గారి ప్లేస్ లో అపాయింట్ చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు అనసూయ సంతోష పడిపోతూ ఉంటుంది. లాస్య కూడా సంతోషంతో గెంతులేస్తూ నందు దగ్గరికి వస్తుంది. ఇక శృతి, ప్రేమ్ వాళ్ళ తాతయ్య సామ్రాట్ ఏంటి ఇలా చేశాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. తులసి మాత్రం నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ సరదాగా బతుకమ్మలు ఆడుతూ ఉంటారు అందరూ అలా ఆడుతున్న సమక్షంలో సామ్రాట్ తో కలిసి తులసి కోలాటం ఆడుతూ ఉంటుంది. అనసూయ అది చూసి తట్టుకోలేక తులసి దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న కోలాటంకర్రలను తీసుకుంటుంది. ఇక దాంతో తులసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది