Intinti Gruhalakshmi 11 Oct Today Episode : పెళ్లి పీటల మీద కూర్చున్న ప్రేమ్, అక్షర.. శృతిని రూమ్ లో పెట్టి లాక్ వేసిన నందు
Intinti Gruhalakshmi 11 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 11 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, అక్షర పెళ్లి పనులు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అక్షరతో గౌరీ పూజ నిర్వహిస్తాడు పూజారి. అక్షరను పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతాడు పూజారి. మొదటగా ఆశీర్వాదం తీసుకోవాల్సింది అమ్మ లాంటి మీ అత్తయ్య దగ్గర అమ్మా.. అని అంటాడు జీకే.
ఇన్నేళ్లు నీకు ఏం కావాలన్నా ఈ డాడీని అడిగేదానివి. ఇక నుంచి నీ కష్టసుఖాలు చెప్పుకోవాల్సింది నీ అత్తయ్య గారినే అమ్మా. నీకు అండగా ఉండేది, భరోసా కల్పించేది కూడా ఆ అత్తయ్య గారే అని చెబుతాడు జీకే. బావ గారు.. వచ్చి చెల్లె దగ్గర నిల్చోండి. అమ్మాయి ఆశీర్వదిస్తుంది అంటాడు జీకే. అక్షర.. తులసి ఆశీర్వాదం తీసుకోవడానికి అక్షర కిందికి వంగి.. తన కాళ్లకు నమస్కరించడంతో.. తనకు ఏం చేయాలో అర్థం కాదు.

intinti gruhalakshmi 11 october 2021 latest episode
ఇక ముహూర్తానికి టైమ్ అవడంతో నేను కళ్యాణమండపానికి బయలుదేరుతా అని చెబుతాడు జీకే. మరోవైపు ప్రేమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే తులసి.. ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ఏమైంది ప్రేమ్ అంటుంది. అక్షరను దీవించానని కోపమా అంటుంది తులసి. నా పరిస్థితిని ఎవరు ఆలోచిస్తున్నారు. నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు.. అంటాడు ప్రేమ్. నువ్వు నాకు అమ్మవు. నాకు అంతా మంచే జరగాలని చెప్పాలి కానీ.. ఇలా అక్షరను దీవించడం ఏంటి.. అనగానే నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. ఆత్మవిశ్వాసంతో ఉండు అంటుంది తులసి. నీకు శృతి మీద ఉన్న ప్రేమ కన్నా.. శృతికి నీమీద వంద రెట్ల ప్రేమ ఉంది.. అంటుంది తులసి.
కొండంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు నాకు చెప్పలేదు అంటే.. అక్షరతో నీ పెళ్లి జరగాలని శృతి కోరుకుంది కాబట్టి అంటుంది తులసి. తనను మీ నాన్న, లాస్య భయపెట్టారు. నిన్ను శృతి పెళ్లి చేసుకుంటే.. మన కుటుంబాన్ని నాశనం చేస్తామని బెదరించి.. తన ప్రేమను సమాధి చేసేశారు.. అంటుంది తులసి. దీంతో వెంటనే వెళ్లి నేను అందరినీ నిలదీస్తా అంటాడు ప్రేమ్. వద్దు.. ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు.. వద్దు ప్రేమ్.. ఆవేశంతో కాదు.. తెలివితో ఆలోచించు. ఒక్క తప్పు చేసినా శృతిని జీవితాంతం దూరం చేసుకున్నవాడివి అవుతావు అని అంటుంది తులసి.
Intinti Gruhalakshmi 11 Oct Today Episode : ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి బట్టలు సర్దుకున్న శృతి
కట్ చేస్తే.. శృతి తన డ్రెస్సులు సర్దుకుంటూ ఉంటుంది. ఏడుస్తూ తన బ్యాగులో బట్టలు సర్దుకుంటుండగా అప్పుడే తులసి వచ్చి.. నన్ను ఏమన్నా సాయం చేయమంటావా? అని అడుగుతుంది తులసి. నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో.. అని అంటూనే నేనన్నా నా మాటలన్నా నీకు చిరాకుగా ఉన్నాయి కదా. నా వైపు నిన్ను చూడాలని కూడా అనిపించడం లేదు కదా. మీ నాన్న లేనప్పుడు.. నేను నీకు అమ్మలా నీకు తోడు ఉంటానని ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఆ తర్వాత నీకు అత్తను అవుదామని అనుకున్నాను కానీ.. నాకు దేవుడు ఆ అదృష్టం ఇవ్వలేదు అని చెబుతుంది తులసి.. అనగానే ఆంటి అంటూ బోరున ఏడుస్తుంది శృతి. ప్రేమ్ పెళ్లి చూడకుండా బట్టలు సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే.. నేను దివ్య రూమ్ కు షిఫ్ట్ అవుతున్నాను అంటుంది శృతి.

intinti gruhalakshmi 11 october 2021 latest episode
కట్ చేస్తే కళ్యాణ మండపంలో ప్రేమ్, అక్షర పెళ్లి వేడుక జరుగుతుంటుంది. ప్రేమ్ ను పెళ్లి మండపం మీదికి తీసుకెళ్లి పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. పెళ్లి కూతురు అక్షరను కూడా పెళ్లి మండపం మీదికి తీసుకొస్తారు. మరోవైపు శృతిని రూమ్ లో ఉంచి తాళం వేస్తాడు నందు. పెళ్లి బట్టలు తెస్తానని ఇప్పటి వరకు శృతి రాలేదు ఏంటి అని టెన్షన్ పడుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.