
intinti gruhalakshmi 13 january 2023 full episode
Intinti Gruhalakshmi 13 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 జనవరి 2023, శుక్రవారం ఎపిసోడ్ 841 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను దూరంగా ఉండి చేయగలిగింది ఏం లేదు. బాధపడటం తప్ప.. అని తులసి.. సామ్రాట్ తో చెబుతుంది. దీంతో డైరెక్ట్ గా యుద్ధం చేయాలనుకుంటున్నారు అంతే కదా అంటాడు సామ్రాట్. దీంతో మీరు నా నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా అని అడుగుతుంది తులసి. దీంతో మీరు ఆ ఇంట్లో లేకపోవడమే లాస్యకు అడ్వాంటేజ్. లాస్య ఆగడాలకు చెక్ చెప్పాలంటే మీరు ఆ ఇంట్లో ఉండాల్సిందే. కానీ.. మీ మంచితనం మీ కాళ్లకు అడ్డుపడుతోంది. దాన్ని పక్కన పెడితేనే అనుకున్నది సాధించగలుగుతాం. పైగా నందగోపాల్ కూడా లాస్య వైపే ఉన్నాడు అంటాడు సామ్రాట్. దీంతో దాని వల్ల నష్టం ఆయనకే అంటుంది తులసి.
intinti gruhalakshmi 13 january 2023 full episode
ఆ ఇల్లు మాది. అక్కడ ఉండాల్సిన హక్కు మాది. దాన్ని ఎప్పటికీ వదులుకోను అంటుంది తులసి. దీంతో ఆల్ ది బెస్ట్ అంటాడు సామ్రాట్. మరోవైపు సేట్ ను తీసుకొచ్చిన నందు.. తన ఇంటిని చూపిస్తాడు. ఇల్లు బాగుంది అంటాడు సేటు. ఎవరు ఇతడు అని అడుగుతాడు పరందామయ్య. దీంతో మన శ్రెయోభిలాషి అంటుంది లాస్య. మనకు ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా అప్పు ఇస్తుంటారు అని చెబుతుంది లాస్య. ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అనసూయ. దీంతో ఈ ఇంటిని తాకట్టు పెట్టడానికి అని చెబుతుంది. తర్వాత ఇంటి డాక్యుమెంట్స్ ను తీసుకొచ్చి సేటుకు ఇస్తుంది లాస్య. ఈ ఇల్లు మీ పేరు మీదనే ఉంది కదా అని అడుగుతాడు సేటు. దీంతో అవును అంటాడు నందు. దీంతో కాదు అని అప్పుడే అక్కడికి వచ్చిన తులసి చెబుతుంది.
ఇల్లు నా పేరు మీద ఉంది అని అంటుంది తులసి. దీంతో ఆమె మాటలు నమ్మకండి అంటుంది తులసి. దీంతో తులసే నా పేరు మీద ఈ ఇంటిని రాసింది అంటుంది లాస్య. దీంతో ఇల్లు ఆమె పేరు మీద రాసిన మాట వాస్తవమే కానీ.. ఆ ఇల్లు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు అంటుంది తులసి.
దీంతో వాటిని చెక్ చేసిన సేటు.. అవును రిజిస్ట్రేషన్ కాలేదు. ఎందుకు రిజిస్ట్రేషన్ కాని ఇంటిని మాకు తాకట్టు పెట్టాలని చేశారు. ఇంత మోసమా. ఇంకోసారి మీ ముఖాన్ని నాకు చూపించకండి అని చెప్పి.. తులసికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతు సేటు.
ఇదంతా మీకు ముందే తెలుసు కదా నాన్న అంటాడు పరందామయ్య. ఇదంతా ముందే ప్లాన్ చేశారు కదా అంటాడు నందు. దీంతో మిస్టర్ నంద గోపాల్.. అంటూ తులసి నందుపై విరుచుకుపడుతుంది. ఆరోజు ఇల్లు తన పేరు మీదికి రాయమన్నది అత్తయ్య. డాక్యుమెంట్ లో అత్తయ్య పేరు ఉందనుకున్నా.
కానీ.. డాక్యుమెంట్ లో తన పేరు రాసుకొని మోసం చేసింది లాస్య. మీరు కూడా అప్పుడు లాస్య మీద చిందులు వేశారు కదా. ఆ విషయం ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అంటుంది తులసి. దీంతో వాడు పొద్దుతిరుగుడు పువ్వు అమ్మా. ఎటువైపు అవసరం ఉంటే.. అటువైపు తిరుగుతాడు.
నేను మీలా మాటలు మార్చే టైప్ కాదు. ఇంటిని ఇప్పటికైనా అత్తయ్య పేరు మీదికి రాసేందుకు రెడీగా ఉన్నాను అంటుంది తులసి. దీంతో వద్దమ్మా.. నా పేరు మీదికి వద్దు. ఆ ఇల్లును చూసి ఎప్పుడైనా నా గొంతు పిసికినా పిసికేస్తారు అంటుంది అనసూయ.
అలా మాట్లాడకండి. ఎప్పటికైనా మిమ్మల్ని చూసుకోవాల్సింది మేమే అంటుంది లాస్య. దీంతో హలో అంత అవసరం లేదు. నేను వచ్చేశాను. శాశ్వతంగా ఇక్కడే ఉండేందుకు వచ్చాను అంటుంది తులసి. దీంతో ఏ మొహం పెట్టుకొని వచ్చావు. ఎప్పటికప్పుడు మనుషులను మార్చేది తులసి మామయ్య అంటుంది లాస్య.
నేను ఇంట్లో నుంచి ఆరోజు వెళ్లిపోయింది మీరు నిందలు వేశారని కాదు. నేను అమ్మలా భావించే అత్తయ్య నన్ను అవమానించారని అంటుంది తులసి. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెంపలు వేసుకుంటున్నాను. ఇప్పుడు తులసిని నేనే రమ్మన్నాను అంటుంది అనసూయ.
మేము మనుషులం కదా.. ఈ ఇంట్లో మనుషులం కాదా అంటుంది లాస్య. ఒకప్పుడు నువ్వు కూడా ఈ ఇంటిని తాకట్టు పెట్టావు అంటాడు నందు. దీంతో అప్పుడు నువ్వు మామయ్య ను పట్టించుకోలేదు. మామయ్య గుండె ఆపరేషన్ కోసం ఆ పని చేయాల్సి వచ్చింది అంటుంది తులసి.
సిగ్గు లేకుండా అసలు ఈ ఇంట్లో ఎలా అడుగుపెడతావు. మేము రానివ్వం అంటుంది లాస్య. దీంతో రానివ్వకపోవడానికి మీరెవరు అసలు. ఈ ఇల్లు నాది. మీకు ఇష్టం లేకపోతే హ్యాపీగా ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవచ్చు అని అంటుంది తులసి. దీంతో నందు, లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు.
వెంటనే నందు తన రూమ్ లోకి వెళ్లి బట్టలు సర్దుతూ ఉంటాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. దీంతో అర్జెంట్ గా ఈ ఇంటి నుంచి బయట పడాలి అంటాడు. దీంతో బయటికి వెళ్లి ఏం చేస్తావు అంటుంది లాస్య. దీంతో బయటికి వెళ్లి ఏం చేస్తావు అంటుంది లాస్య.
ఓడిపోయిన చోటే గెలవాలి. ఓడిపోయిన వాళ్ల ముందే గెలవాలి. అప్పుడు కదా మనకు సాటిస్ఫాక్షన్. పారిపోతే పిరికివారు అనుకుంటారు అంటుంది లాస్య. మరోవైపు సామ్రాట్ ఎందుకో మూడీగా కూర్చొని ఉంటాడు. ఏమైందో అని బాబాయి వెళ్లి అడుగుతాడు.
అంత డల్ గా ఉన్నావెందుకు అని అడుగుతాడు. ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నా అంటాడు. దీంతో ఎందుకురా అబద్ధం చెబుతున్నావు. నువ్వు తులసి గురించే ఆలోచిస్తున్నావు అనేది నిజం అంటాడు. మరోవైపు లాస్య దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ తాళం చెవిని లాక్కుంటుంది తులసి.
ఇద్దరూ చాలెంజ్ విసురుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.