Intinti Gruhalakshmi 14 July Today Episode: హనీకి యాక్సిడెంట్ చేసిన నందు.. ఈ విషయం తెలిసి సామ్రాట్ షాక్.. తులసి దగ్గరికి హనీ ఎలా చేరింది?
Intinti Gruhalakshmi 14 July Today Episode: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 జులై 2022, గురువారం ఎపిసోడ్ 684 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వద్దన్నా వినకుండా హనీ రోడ్డు మీద సైకిల్ తొక్కుతూ ఉంటుంది. దీంతో పని మనిషి ఎక్కడికి వెళ్లిందని వెతుకుతూ ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ కూడా హనీని వెతకడం కోసం వెళ్తారు. మరోవైపు సామ్రాట్ ను కలవడం కోసం నందు, లాస్య వెళ్తుంటారు. ఇంతలో హనీ సైకిల్ కు తన కారు ఢీకొడుతుంది. దీంతో హనీ కింద పడుతుంది. రక్తం కారుతుంది. నందు కారు ఆపి ఆ పాపకు ఏమైందో చూద్దామన్నా లాస్య చూడనివ్వదు. వెళ్దాం పదా అంటుంది. దీంతో నందు కారు పోనిస్తాడు. ఇంతలో తులసి ఆటోలో వెళ్తూ పాపను చూస్తుంది. వెంటనే ఆటో ఆపి.. పాపను తీసుకొని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకొస్తుంది. పాపను తులసి తీసుకురావడం నందు చూసి అదే కారులో ఆసుపత్రికి వస్తారు.
intinti gruhalakshmi 14 july 2022 full episode
పాపకు ఏమైంది అని అడుగుతారు డాక్టర్లు. దీంతో యాక్సిడెంట్ అయింది అంటారు. మీరు ఏమౌతారు అని అంటే నేను పాప అమ్మను అంటుంది తులసి. పాప ఎవరో తెలియదు అంటే ట్రీట్ మెంట్ చేయరేమో అనుకొని అమ్మను అని చెబుతుంది. దీంతో వెంటనే రిసెప్షన్ దగ్గరికి వెళ్లి మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి అని చెబుతుంది. దీంతో సరే అని వెళ్లి ట్రీట్ మెంట్ కు డబ్బులు కట్టి వస్తుంది తులసి. ఇంతలో నందు, లాస్య ఇద్దరూ ఆసుపత్రికి వస్తారు. అక్కడ తులసిని చూస్తారు. నేను చేసిన తప్పుకు పాపం తులసి శిక్ష అనుభవిస్తోంది అంటాడు. నందు ఇక వెళ్దాం పదా. సామ్రాట్ ఇచ్చిన టైమ్ అయిపోతుంది.. అని చెప్పి నందును అక్కడి నుంచి తీసుకెళ్తుంది.
ఇంతలో పాపకు ట్రీట్ మెంట్ చేస్తుంటారు డాక్టర్లు. పాప ఇంకా స్పృహలోకి రాలేదు అంటారు. మరోవైపు సామ్రాట్ దగ్గరికి వెళ్తారు నందు, లాస్య. మరోవైపు సామ్రాట్ ఆఫీసుకు వస్తాడు. ఆఫీసుకు రాగానే ఎవరో అబద్ధం చెప్పారని జాబ్ లో నుంచి తీసేస్తాడు. మళ్లీ ఎందుకు వచ్చాడు అంటాడు. తప్పు చేసినా సహిస్తాను కానీ.. అబద్ధం చెబితే అస్సలు సహించను అంటాడు సామ్రాట్.
Intinti Gruhalakshmi 14 July Today Episode: స్పృహలోకి వచ్చిన హనీ
మరోవైపు పాప కోసం వెతుకుతూ తన సైకిల్ ను చూస్తారు కానీ.. పాప కనిపించదు. దీంతో వెంటనే సామ్రాట్ కు ఫోన్ చేసి పాప కనిపించడం లేదని చెబుతాడు. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. వెంటనే ఇంటికి వెళ్తాడు. మరోవైపు పాపకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతుంది డాక్టర్.
దీంతో తులసి ఊపిరి పీల్చుకుంటుంది. అంతా నార్మల్. ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు అంటుంది డాక్టర్. మరోవైపు నా పాపను ఎవరో కిడ్నాప్ చేశారని సామ్రాట్ పోలీసులకు సమాచారం ఇస్తాడు. నా పాప గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్లకు ఒక కోటి ఇస్తా అని చెప్పండి. 24 గంటల్లో నా పాప నా దగ్గర ఉండేలా చేయండి అని చెప్తాడు.
తర్వాత హనీ స్పృహ లోకి వస్తుంది. దీంతో మీ పేరెంట్స్ నెంబర్ చెప్పు నేను మీ వాళ్లకు ఫోన్ చేస్తా అంటుంది. దీంతో గుర్తు రావడం లేదు అంటుంది. పోనీ మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతుంది. దీంతో తెలియనట్టు నటిస్తుంది. మీతో పాటే తీసుకెళ్లండి ఇల్లు ఎక్కడుందో చూపిస్తాను అంటుంది హనీ.
దీంతో ఆటోలో కూర్చోబెట్టుకొని తనకు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తుంది తులసి. కానీ.. అక్కడ తన ఇల్లు ఎక్కడుందో చెప్పదు హనీ. మరోవైపు సామ్రాట్ కూడా తన కూతురు కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.