Intinti Gruhalakshmi 16 April Today Episode : సినిమాకు పాట రాసే చాన్స్ కొట్టేసిన ప్రేమ్.. తులసికి షాకిచ్చిన అభి.. అంకిత, అభి ఇంట్లో నుంచి వెళ్లిపోతారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 16 April Today Episode : సినిమాకు పాట రాసే చాన్స్ కొట్టేసిన ప్రేమ్.. తులసికి షాకిచ్చిన అభి.. అంకిత, అభి ఇంట్లో నుంచి వెళ్లిపోతారా?

 Authored By gatla | The Telugu News | Updated on :16 April 2022,9:30 am

Intinti Gruhalakshmi 16 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 ఏప్రిల్ 2022, శనివారం ఎపిసోడ్ 608 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆంటి నేను ఒంటరిగా లేను. అత్తారింట్లో కోడలుగా ఉన్నాను. మా అమ్మ ఎంతో మీరూ అంతే. ఇంత వయసు వచ్చాక మా అమ్మకు ఇది నేను నేర్పించాలా. నిజంగా ఈ ఇంట్లో అందరం పస్తులు ఉంటున్నామంటే.. నా ఒక్కదాని కడుపు నింపితే ఎలా ఉంటుంది అంటుంది అంకిత. ఇదే విషయాన్ని నెమ్మదిగా కూడా చెప్పొచ్చు కదా అమ్మ అంటుంది అంకిత. దీంతో ఒక్క విషయం చెప్పండి ఆంటి.. మీ అత్తామామలను ఎవరైనా ఏమైనా అంటే మీరు ఊరుకుంటారా అంటుంది అంకిత. ప్రేమ్ లాగానే.. అంకిత కూడా ఇలాగే మొండిగా మాట్లాడుతోంది అని అనుకుంటుంది తులసి. అంకితకు కూడా నేనే బలహీనంగా మారానా అని అనుకుంటుంది.

intinti gruhalakshmi 16 april 2022 full episode

intinti gruhalakshmi 16 april 2022 full episode

ఇంతలో తులసి వాళ్ల అమ్మ వస్తుంది. తులసి.. వాళ్ల అమ్మను చూసి సంతోషిస్తుంది. ఎదురుగా కనిపిస్తేనేనా ఆపేక్ష. అమ్మ దగ్గరికి వెళ్లాలి.. చూడాలి అనిపించలేదా అని అడుగుతుంది. నేనేంటో.. నేను ఉన్న పరిస్థితి ఏంటో మా అమ్మకు బాగా తెలుసు.. అంటుంది తులసి. ఇంతలో దివ్య వచ్చి అమ్మమ్మ అని పలకరిస్తుంది. ఏరోజు చివరి రోజు అవుతుందో తెలియదు. అందరినీ చూడాలనిపిస్తోంది అని అంటుంది తులసి తల్లి. తర్వాత ఇంట్లోకి వెళ్తుంది. అనసూయ, పరందామయ్య అందరూ తనను పలకరిస్తారు. తనకు రాసి పెట్టి ఉంది జరిగింది.. అనుభవించాల్సి ఉంది.. అనుభవిస్తుంది అని చెబుతుంది తులసి తల్లి.

తులసి మమ్మల్ని కన్నకూతురుగా చూసుకుంటుంది. అమ్మలా జాగ్రత్తగా చూసుకుంటుంది.. ఎలా తన రుణం తీసుకోవాలి అని అంటారు పరందామయ్య, అనసూయ. మీరు గుర్తొచ్చినప్పుడల్లా నాకు అసూయగా ఉంటుంది. మిమ్మల్ని తులసి నాకన్నా బాగా చూసుకుంటుంది అంటుంది తులసి తల్లి.

కష్టాలు నాకు కొత్త కాదు. వాటిని ఎలా ఎదుర్కోవాలో మా అమ్మే నాకు నేర్పించింది అని చెబుతుంది తులసి. మరోవైపు షూటింగ్ విషయంపై బప్పిల హరి దగ్గరికి డైరెక్టర్ వస్తాడు. అనుకున్న సమయానికి నాకు సాంగ్ కావాలి.. అంటూ డిమాండ్ పెడతాడు.

దీంతో ఇప్పటికిప్పుడు ఎవరు పాట రాస్తారు అని బప్పిల హరి అనుకుంటాడు. అక్కడే ప్రేమ్ ఉంటాడు. బప్పిల హరి టెన్షన్ పడుతుంటే.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అంటాడు. ఏం చేయాలో హరికి అర్థం కాదు. సిచ్యుయేషన్ చెప్పండి.. నేను పాట రాస్తాను అంటాడు.

Intinti Gruhalakshmi 16 April Today Episode : అభిని కలిసిన గాయత్రి

సరే అని సిచ్యుయేషన్ చెబుతాడు. ఒకవేళ రేపు ఉదయం వరకు నువ్వు పాట రాయకపోతే మళ్లీ నాకు కనిపించకు అంటాడు. ఒకవేళ వీడు పాట బాగా రాస్తే.. దాన్ని మనం నొక్కేసి మన పేరు అచ్చేయించుకుందాం అనుకుంటాడు బప్పిల హరి.

మరోవైపు తులసి, తన తల్లి ఇద్దరూ కాసేపు ఒంటరిగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారు. ఇంతలోనే నేను వెళ్లిపోతా అంటుంది తులసి తల్లి. ఇంటి దగ్గర దీపక్, శ్రావణి ఎదురుచూస్తుంటారు. మళ్లీ ఎప్పుడైనా తీరిక చూసుకొని వస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది తులసి తల్లి.

కట్ చేస్తే.. గాయత్రి.. అభిని కలుస్తుంది. నా కూతురు మీ ఇంటి కోడలుగా కష్టాలు పడుతోంది. అది నేను చూడలేకపోతున్నాను అంటుంది. అంకితను మా అమ్మ కన్న కూతురులా చూసుకుంటోంది అంటాడు అభి. నా కూతురు పరిస్థితి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది అంటుంది గాయత్రి.

నా దగ్గర కావాల్సినంత ఆస్తి ఉంది.. పలుకుబడి ఉంది కానీ… దాని కోసం ఏం చేయలేకపోతున్నాను. ఈ అమ్మ మనసు తెలుసుకోకుండా నన్ను ఒక శత్రువులా చూస్తోంది అంటుంది గాయత్రి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం లేదు ఆంటి అంటాడు అభి.

దీంతో పరిష్కారం ఉంది అంటుంది గాయత్రి. మీరిద్దరూ ఆ ఇల్లు వదిలి మా ఇంటికి రండి అంటుంది. దీంతో అది కుదరదు అంటాడు అభి. కిందటి సారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చేసిన అవమానాలు నాకు ఇంకా గుర్తున్నాయి అంటాడు అభి.

అవి నేను అంత ఈజీగా మరిచిపోలేను అంటాడు అభి. సరే.. ఇంకొక పరిష్కారం చెబుతాను అంటుంది గాయత్రి. అంకిత పేరు మీద త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నా అంటుంది గాయత్రి. ఇవి ఫ్లాట్ కీస్ అంటుంది గాయత్రి. వాటిని తీసుకొని మీరు ఇద్దరు ఆ ఫ్లాట్ లో ఉండండి అని చెబుతుంది గాయత్రి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది