Home » Entertainment » Pushpa Oo Antava Song Male Version Released By Makers
Entertainment

Pushpa : ‘ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాప’.. పేరడీ.. మేల్ వర్షన్ ఆఫ్ పుష్ప సాంగ్..

Authored By
mallesh
The Telugu News | Published on: December 18, 2021, 1:00 pm
Advertisement

Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ దిశగా పిక్చర్ కొనసాగుతోంది. మెగా అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ ప్రత్యేకమైన ఆకర్షణీయమైన అంశంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.బన్నీతో కలిసి ‘ఊ అంటావా మావా’ సాంగ్ కు వేసిన స్టెప్పులు చూసి సినీ అభిమానులు .

Advertisement

ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్స్ లో ఆ పాటను చూసి ప్రేక్షకులు గోల గోల చేస్తున్నారు. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఇక ఈ పాటలోని లిరిక్స్‌పై ఆంధప్రదేశ్ పురుషుల సంఘం అభ్యంతరం తెలిపింది. హై కోర్టులో సాంగ్ బ్యాన్ చేయాలని కంప్లయింట్ చేసింది. ఆ సంగతి అలా ఉంచితే.. సినిమాలోని పాట ఫిమేల్ వర్షన్ కాగా, మేల్ వర్షన్ సాంగ్‌ను రిలీజ్ చేశారు ‘రేలా రే రేలా’ రమణ్ టీమ్.ఈ మేల్ వర్షన్ సాంగ్ ‘ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాప’ లైన్స్‌తో షురూ అవుతుంది.

pushpa oo antava song male version released by makers

Advertisement

Pushpa : యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టేందుకు బయలు దేరిన మేల్ వర్షన్ సాంగ్.. !

ఈ పాటకు లిరిక్స్ ప్రశాంత్ అందించగా, ‘రేలా రే రేలా’ రమణ ఆలపించారు. పాట యూట్యూబ్‌లో విడుదల కాగా, ప్రశంసలు లభిస్తున్నాయి. ఆ పాట మాదిరిగా ఈ పాట కూడా సూపర్ హిట్ అయి అందరి ప్రశంసలు పొందుతుందని అంటున్నారు. ఇలా పేరడీ చేసే క్రమంలో తాము ఎవరినీ కించపరచాలని అలా చేయడం లేదని పేర్కొన్నారు మేల్ వర్షన్ సాంగ్ మేకర్స్. సాంగ్ రైట్స్ అన్నీ ‘పుష్ప’ మూవీ యూనిట్ కు చెందుతాయని తెలిపారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి