Intinti Gruhalakshmi 18 Oct Today Episode : సామ్రాట్, తులసి మధ్య అఫైర్ ఉందని ఉద్యోగులకు చెప్పిన లాస్య.. దీంతో సామ్రాట్ షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 18 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 అక్టోబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 766 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు అలా చెప్పపెట్టకుండా ఎలా రాకుండా ఉంటాడు.. అంటూ నందు ఉద్యోగం మానేసినందుకు లాస్యపై అరుస్తాడు సామ్రాట్. ఆయన ఉద్యోగానికి రాకపోతే ఆఫీసులో పనులన్నీ ఆగిపోతాయా అని అంటాడు. దీంతో ఎవరు రాకున్నా పనులు ఆగవు సార్. నందు పనులన్నీ నేను చూసుకుంటాను అంటుంది లాస్య. కంపెనీ రెప్యుటేషన్ కు ఏం కాకుండా చూసుకుంటాను అంటుంది లాస్య. దీంతో సరే వెళ్లి ఆర్డర్ టైప్ చేయించుకురా అంటాడు సామ్రాట్. దీంతో లాస్య చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. కానీ.. ఆర్డర్ టైప్ చేయించేది నీ పేరు మీద కాదు.. తులసి గారి పేరు మీద అంటాడు సామ్రాట్.
దీంతో లాస్యకు కోపం వస్తుంది. ఇదివరకే తులసి రూ.10 కోట్ల నష్టం వచ్చేలా పని చేసింది అంటుంది లాస్య. కానీ.. సామ్రాట్ మాత్రం అవేవీ వినకుండా వెళ్లి ఈ ఫైల్ తనతో సంతకం పెట్టించి.. తనను జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నట్టు చెప్పు అంటాడు సామ్రాట్. దీంతో అక్కడి నుంచి కోపంగా తులసి క్యాబిన్ కు వెళ్తుంది లాస్య. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు అంటుంది. ఇది మ్యూజిక్ ఫైల్ కాదు కదా. మరి.. ఈ ఫైల్ మీద నేను సంతకం పెట్టడం ఏంటి అని అంటుంది తులసి. దీంతో నిన్ను మళ్లీ జీఎంను చేశారు. అందుకే ఈ ఫైల్ మీద సంతకం పెట్టి తీసుకురమ్మన్నారు అంటుంది లాస్య.
దీంతో వెంటనే సామ్రాట్ క్యాబిన్ కు వెళ్లి మళ్లీ ఏంటి అని అడుగుతుంది. దీంతో షాక్ అవుతాడు సామ్రాట్. ఇంకోసారి అలా జరగదు.. నా మాట నమ్మండి అంటాడు సామ్రాట్. ఇదివరకు కూడా అలాగే చెప్పారు. నాకు సపోర్ట్ గా ఉంటా అన్నారు కానీ.. ఏమైంది అని అడుగుతుంది తులసి.
దీంతో ఈ సారి అలా జరగదు. నా మాట నమ్మండి అంటాడు సామ్రాట్. దీంతో సరే అంటుంది. దీంతో సామ్రాట్ కూల్ అవుతాడు. ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీటింగ్ లో అత్యుత్సాహం ప్రదర్శించాలని చూస్తుంది లాస్య.
Intinti Gruhalakshmi 18 Oct Today Episode : క్లయింట్స్ ముందు లాస్యను అవమానించడంతో బయటికి వచ్చేసిన లాస్య
జనరల్ మేనేజర్ తులసి బ్రీఫ్ ఇస్తారని అని చెప్పినా కూడా లాస్య బ్రీఫింగ్ ఇవ్వబోగా.. సామ్రాట్ అడ్డుకుంటాడు. క్లయింట్స్ ముందే తనను అవమానించాడని అక్కడి నుంచి బయటికి వస్తుంది లాస్య.
బయటికి వచ్చి అందరు ఉద్యోగుల ముందు కోపంగా సామ్రాట్, తులసి గురించి మాట్లాడుతుంది. ఆమె మాటలే వింటాడు. చదువు లేదు.. సంధ్య లేదు.. అర్థం చేసుకోవడం రాదు. కానీ.. పెత్తనం మాత్రం చెలాయిస్తోంది అంటుంది లాస్య.
ఐదు నిమిషాలు సామ్రాట్ గారి గురించి మాట్లాడితే అందులో 50 సార్లు తులసి అంటాడు. నందు విషయంలో అదే జరిగింది. అవమానించి తరిమికొట్టారు అంటుంది లాస్య. ఎవరు తరిమికొట్టారు అని అడుగుతారు స్టాఫ్.
దీంతో ఇంకెవరు మన ప్రియాతి ప్రియమైన బాస్ గారు అంటుంది లాస్య. లాస్య గట్టిగా మాట్లాడే మాటలు విని బయటికి వస్తాడు సామ్రాట్. వాళ్లిద్దరి మధ్య అంతకుమించి ఏదో ఉంది అని లాస్య చెబుతుండగా అక్కడికి వస్తాడు సామ్రాట్.
తనను చూసి ఆపేస్తుంది లాస్య. ఎందుకు ఆపేశావు లాస్య. కంటిన్యూ చేయి అంటాడు సామ్రాట్. దీంతో ఐయామ్ సారీ సామ్రాట్ గారు. అంటే నా ఉద్దేశం అంటూ ఏదో చెప్పబోతుంది. సడెన్ గా నాకెందుకు అంత కోపం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అంటుంది లాస్య.
ఇది నా మొదటి తప్పే కాదు.. చివరి తప్పు కూడా అనుకొని నన్ను క్షమించండి అంటుంది. దీంతో ఇది నీ మొదటి తప్పు మాత్రమే కాదు.. ఇదివరకు చాలా తప్పులు చేశావు. జాబ్ లో నుంచి తీసేయొద్దు అని కూడా బతిమిలాడావు.
తులసి గారు చెప్పారు కాబట్టి ఊరుకున్నాను. నేను అప్పుడు ఏం చెప్పానో గుర్తుందా? నీ కారణంగా కానీ.. నీ భర్త కారణంగా గానీ, నా కంపెనీకి, నా ప్రాజెక్టులకు, తులసి గారికి అవమానం జరగకూడదని చెప్పా కదా.
కానీ.. నువ్వు తప్పు చేశావు. చాలా పెద్ద తప్పు చేశావు అంటాడు సామ్రాట్. మీ అత్తయ్య అంటే పాతకాలపు మనిషి. ఆమె అర్థం చేసుకోలేకపోయింది కానీ.. నువ్వు ఈ తరానికి చెందిన యువతవు.
ఒకవిధంగా నీకంటే మీ అత్తయ్యే మేలు. తులసి గారి మీద ప్రేమ ఉంది. తులసి గారి మీద నింద పడకూడదనే భయం ఉంది.. అంటూ చెబుతుండగా తులసి కూడా బయటికి వస్తుంది. నువ్వు మాత్రం కారణం లేకుండా తులసి గారిని అవమానించావు.. అంటాడు సామ్రాట్.
నీ గురించి మాట్లాడటానికి, నింద వేయడానికి నా దగ్గర చాలా మ్యాటర్ ఉంది. నీ కంటే ఎక్కువ మాట్లాడగలను అంటాడు సామ్రాట్. కానీ.. నేను అలా కాదు. పది మంది ముందు ఆడదాని పరువు తీయాలనుకోను అంటాడు సామ్రాట్.
నువ్వు చేయగలిగే మంచి పని ఏదైనా ఉంది అంటే.. వెంటనే గెట్ లాస్ట్ అంటాడు సామ్రాట్. ప్లీజ్ సామ్రాట్ గారు అంటుంది లాస్య. కానీ.. సామ్రాట్ వినడు. సార్.. నన్ను జాబ్ లో నుంచి తీసేయొద్దు అంటుంది లాస్య.
నా రెప్యుటేషన్ పాడవుతుంది అంటుంది లాస్య. దీంతో నీకు రెప్యుటేషన్ కూడా ఉందా.. జస్ట్ లీవ్ లాస్య అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.