Intinti Gruhalakshmi 19 Aug Today Episode : ఫుల్లుగా మద్యం తాగి పిచ్చి పిచ్చి చేసిన సామ్రాట్, నందు.. క్లయింట్ మీటింగ్ కు అటెండ్ కాకపోవడంతో సామ్రాట్ సీరియస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 19 Aug Today Episode : ఫుల్లుగా మద్యం తాగి పిచ్చి పిచ్చి చేసిన సామ్రాట్, నందు.. క్లయింట్ మీటింగ్ కు అటెండ్ కాకపోవడంతో సామ్రాట్ సీరియస్

 Authored By gatla | The Telugu News | Updated on :19 August 2022,9:30 am

Intinti Gruhalakshmi 19 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 ఆగస్టు 2022, శుక్రవారం ఎపిసోడ్ 715 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సామ్రాట్, తులసి ఇద్దరూ హోటల్ లో తింటూ ఉండగా అతడికి పొరబోతుంది. దీంతో అతడికి మంచినీళ్లు తాగించి తల మీద తిన్నగా కొడుతుంది. దీంతో తనకు తగ్గుతుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ కలవడంతో అక్కడి నుంచి సామ్రాట్ వెళ్లిపోతాడు. తులసి ఒక్కతే అక్కడ కూర్చోవడంతో నందు అక్కడికి వెళ్లి నీ అదృష్టం బాగుంది అంటాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ కు బిజినెస్ పార్టనర్ అవ్వడం, క్యాడిల్ లైట్ డిన్నర్, విమానం ఎక్కడం ఇవన్నీ చూస్తుంటే నీకు అదృష్టం పట్టినట్టుంది అంటాడు నందు. నాతో ఇంకా ఏమైనా మాట్లాడాలని వచ్చారా అంటుంది తులసి. దీంతో నేను నీ మాజీ భర్తను అని సామ్రాట్ గారికి అంటాడు నందు. నేను చెప్పను అని చెప్పాను కదా. మీ ఆవిడ నన్ను రెచ్చగొడుతుంటే ఆ కోపంలో నేను చెబుతానేమో అని అనుకుంటున్నారా? మాటిచ్చాక తప్పను అంటుంది తులసి. దీంతో థాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.

intinti gruhalakshmi 19 august 2022 full episode

intinti gruhalakshmi 19 august 2022 full episode

మరోవైపు లాస్య అప్పుడే తన టేబుల్ దగ్గరికి వచ్చి నందు ఎక్కడికి వెళ్లాడు అని చూస్తుంది. ఇంతలో తులసిని అక్కడ చూస్తుంది. చిలక ఒక్కతే ఉంది. గోరింక ఎక్కడ అని అనుకుంటుంది. నందు అసలే ఇరిటేటింగ్ మూడ్ లో ఉన్నాడు. సామ్రాట్ కనిపిస్తే రెచ్చిపోతాడు అని అనుకుంటుంది లాస్య. కట్ చేస్తే నందు వాష్ రూమ్ వెళ్తాడు. ఇంతలో అక్కడికి సామ్రాట్ వస్తాడు. వాట్ సర్ అంటాడు సామ్రాట్. దీంతో ఏంటి అద్దంలో తెగ చూసుకుంటున్నారు. తెల్ల వెంట్రుకలు లేకుండా చేసుకుంటున్నారా. తులసి విషయంలో మీ లిమిట్స్ లో మీరు ఉండండి అంటాడు నందు. దీంతో నా విషయంలో కూడా నోరు జారకు అంటాడు సామ్రాట్. తులసి గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరు. ఏ హక్కుతో నాకు వార్నింగ్ ఇస్తున్నావు. నేను నీ బాస్ ను ఆ విషయం మరిచిపోకు అంటాడు సామ్రాట్.

దీంతో నేను తులసి మాజీ భర్తను.. ఆ విషయం నువ్వు తెలుసుకో అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కొట్టుకుంటారు. నందు.. సామ్రాట్ ను బయటికి లాగుతాడు. తులసికి దూరంగా ఉండు అంటే అర్థం కాదా నీకు అంటాడు. తులసి మాజీ భర్తవు.. నీకు అర్థం కాదా అంటాడు. ఇద్దరూ తాగిన మైకంలో కొట్టుకుంటారు. మరోవైపు తులసి, లాస్య ఇద్దరూ వచ్చి వాళ్లను ఆపే ప్రయత్నం చేస్తాడు.

సామ్రాట్ గారు వదిలేయండి అని తులసి బతిమిలాడుతుంది. ఇంతలో లాస్య స్పృహలోకి వస్తుంది. ఇదంతా తన ఊహ. దేవుడా నా ఊహ నిజం కాకుండా చూడు అంటుంది లాస్య. సామ్రాట్ గారు ఎక్కడికి వెళ్లారు. ఇంకా రాలేదు అని అనుకుంటుంది తులసి.

Intinti Gruhalakshmi 19 Aug Today Episode : స్టేజీ మీద డ్యాన్స్ చేసిన సామ్రాట్, నందు

కట్ చేస్తే నందు, సామ్రాట్ ఇద్దరూ మందు కొడుతూ కనిపిస్తారు. ఇద్దరూ ఫుల్లుగా మందు తాగుతారు. దీంతో లాస్య, తులసి ఇద్దరూ వాళ్ల దగ్గరికి వెళ్తారు. మేమిద్దరం ఫుల్లుగా తాగాం సారీ అని అంటారు. నందు ఒక్కడే ఇక్కడ కూర్చొని మందు తాగుతున్నారు. పాపం కంపెనీ లేదని నేను ఫీల్ అయ్యాను. అందుకే కంపెనీ ఇస్తూ నా దగ్గర సెటిల్ అయిపోయాడు అంటాడు నందు.

ఆ తర్వాత ఇద్దరూ స్టేజీ మీదికి వెళ్లి డ్యాన్స్ చేస్తారు. అసలు ఇద్దరూ వేసే కుప్పిగంతులు చూసి అందరూ నవ్వుకుంటారు. వాళ్లను చూసి అక్కడున్న వాళ్లు షాక్ అవుతారు. కొందరు లేడీస్ కూడా వచ్చి వాళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరినీ హోటల్ రూమ్ కు తీసుకెళ్తారు.

తాగిన తర్వాత ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. లిఫ్ట్ ఎక్కండి అంటే అమ్మో నేను రాను.. అంటాడు సామ్రాట్. ఎందుకు అంటే ఇందులోని మగవాళ్లు వెళ్తే ఆడవాళ్లుగా బయటికి వస్తున్నారు అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఉదయం అవుతుంది. కట్ చేస్తే టైమ్ 11. 30 అవుతుంది. 10 గంటలకే క్లయింట్ మీటింగ్ అంటాడు సామ్రాట్.

కానీ.. తులసి క్లయింట్ మీటింగ్ కు అటెండ్ అయి వస్తుంది. ఈ విషయం తెలిసి నందు, లాస్య తులసిపై సీరియస్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది