Intinti Gruhalakshmi 19 Feb Today Episode : తులసిని తిట్టడంతో పోలీస్ కాలర్ పట్టుకున్న అభి.. దీంతో అభిని అరెస్ట్ చేసి సీక్రెట్ ప్లేస్ లో దాచిన ఎస్ఐ.. ఇంతలో తులసికి మరో షాక్
Intinti Gruhalakshmi 19 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 ఫిబ్రవరి 2022, శనివారం ఎపిసోడ్ 560 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభిని వెతుక్కుంటూ వెళ్లిన తులసికి అభి కనిపిస్తాడు. దీంతో అభిని కలిసి ఏంట్రా ఇది అని అడుగుతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. మామ్ అంటాడు అభి. నాకోసం పోలీసులు వెతుకుతున్నారు మామ్. దొరికిపోతాను అంటాడు. అభి.. ఏంటి నాన్నా ఇది అంటుంది. తల్లి మాట వినకపోతే బిడ్డ ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఇప్పుడు తెలిసివచ్చింది మామ్ అంటాడు. ఇక నా వల్ల కావట్లేదు మామ్. నేను బతికున్నానో.. చచ్చానో నాకే అర్థం కావడం లేదు. నరకం చూస్తున్నాను. ఎప్పుడు ఏ వైపు నుంచి పోలీసులు వచ్చి పట్టుకుంటారేమోనన భయం. ఎవరైనా నావైపు చూస్తుంటే భయం. ఏమూలైనా దాక్కొని ఒక్క నిమిషం కళ్లు మూసుకుందామంటే భయం. ఎవరైనా చావంటే భయపడతారు. నాకు బతకాలంటే భయమేస్తుంది మామ్ అంటాడు అభి.
దీంతో నువ్వు భయపడకు. ఇఫ్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు. నీ అమ్మ దగ్గర ఉన్నావు. నువ్వేం టెన్షన్ పడకు. అసలు ఏం జరిగిందో తెలుసు అని అడుగుతుంది తులసి. నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నా మామ్.. నేను ఎవ్వరినీ చంపడానికి చూడలేదు. ఎవ్వరినీ చంపాలనుకోలేదు. నేను చేసిందల్లా 10 లక్షలు అప్పుగా తీసుకోవడమే. నా ఫ్రెండ్ మనోజ్ గాడికి 10 లక్షలు ఇచ్చి స్టాక్ మార్కెట్ లో పెట్టమన్నాను. కానీ.. ఆ డబ్బుతో వాడు పారిపోయాడు. ఆ తర్వాత వాడిని పట్టుకొని నా డబ్బు నాకిచ్చేయమని గొడవ పెట్టుకున్నాను. అంతే కానీ.. వాడిని నేను చంపాలనుకోలేదు. గొడవలో వాడికి ఎలా బీరు సీసా గుచ్చుకుందో అర్థం కాలేదు.. అంటాడు. ఇంతలో పోలీసు జీప్ వచ్చి అక్కడ ఆగుతుంది. దీంతో అభి, తులసి షాక్ అవుతారు.
మామ్ పోలీసులు వచ్చారు. నన్ను వదిలేసేయ్.. నేను పారిపోతాను అంటూ పారిపోబోతాడు అభి. తులసిని నెట్టి పారిపోబోతాడు. దీంతో వద్దు అభి అని అరుస్తుంది తులసి. అయ్యో అభి.. అంటుంది. దీంతో టెన్షన్ పడకు.. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. చల్ అంటూ జీప్ దగ్గరకు తులసిని లాక్కొస్తాడు పోలీస్.
ఒరేయ్ అని అభిని పిలుస్తాడు పోలీస్. పారిపోరా పారిపో. నువ్వు వచ్చేదాకా.. నీ అమ్మ లాకప్ లో ఉంటది అని చెబుతాడు పోలీస్. దీంతో అభి తిరిగి అక్కడికి వచ్చేస్తాడు. ఎస్ఐ గారు నేను లొంగిపోతాను సార్.. నన్ను వదిలేయండి సార్ అంటాడు. తప్పించుకొని తిరుగుతావురా అంటూ చితకబాదుతాడు.
Intinti Gruhalakshmi 19 Feb Today Episode : అభి గురించి ఇంట్లో టెన్షన్ పడ్డ అంకిత
మా వాడు ఏ తప్పు చేయలేదు.. అంటుంది తులసి. కానీ.. ఎస్ఐ మాత్రం వినడు. కానిస్టేబుల్స్ వాడిని జీప్ ఎక్కించండి అంటాడు. వద్దు అని ప్రాధేయపడుతుంది తులసి. అవును.. మధర్ ఇండియా నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు నీ మొగుడు ఏడి అని అడుగుతాడు ఎస్ఐ.
దీంతో నాకు భర్త లేడు అంటుంది తులసి. మెడలో తాళి ఉంది కదా అని హేళన చేస్తాడు ఎస్ఐ. అవును.. మొగుడు లేడన్నావు.. మరి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు. కనీసం ఎవడికి పుట్టాడో అదైనా తెలుసా అని అంటాడు పోలీస్. దీంతో ఒరేయ్ అంటూ అభి కోపంగా వెళ్లి ఆ ఎస్ఐ కాలర్ పట్టుకుంటాడు.
ఈ ఖాకీ యూనిఫాం నా ఒంటి మీదికి వచ్చి 20 ఏళ్లు అయింది. ఇప్పటి వరకు ఎవ్వడూ నా యూనిఫామ్ ను టచ్ చేయలేదు. నువ్వు టచ్ చేసింది నా యూనిఫామ్ ను కాదురా. నా యూనిఫాం వెనుక ఉన్న ఈగోను. నా ఈగోను టచ్ చేసి నీ సమాధికి నువ్వే పునాది వేసుకున్నావు అని అభిని లాక్కెళ్లి పోలీస్ జీప్ లో ఎక్కిస్తారు.
వద్దు అని తులసి ఎంతో బతిమిలాడుతుంది కానీ.. పోలీసులు వినరు. అస్సలు వినరు. నువ్వేం భయపడకురా. రేపటికల్లా నేనే బెయిల్ మీద తీసుకొస్తాను. నిన్ను కాపాడుకుంటాను అని భరోసా ఇస్తుంది తులసి. మరోవైపు అభి గురించి ఇంట్లో టెన్షన్ పడుతుంటారు.
ఇంతలో తులసి ఇంటికి వస్తుంది. అభి కనిపించాడా.. అని అందరూ అడుగుతారు. అంకిత కూడా అడుగుతుంది. కానీ.. తులసి మాత్రం ఏం మాట్లాడదు. తర్వాత కనిపించాడు అని చెబుతుంది తులసి. మరి ఏడి.. ఇంటికి తీసుకురాలేదు ఎందుకు అని అడుగుతాడు పరందామయ్య.
అభి క్షేమంగానే ఉన్నాడు కదా.. ఏం కాలేదు కదా అని అడుగుతుంది అంకిత. అభి క్షేమంగానే ఉన్నాడు కానీ.. పోలీసులు అరెస్ట్ చేశారు.. స్టేషన్ కు తీసుకెళ్లారు అని చెబుతుంది తులసి. ఎంత బతిమిలాడినా వినకుండా స్టేషన్ కు తీసుకెళ్లారు అని చెబుతుంది తులసి.
నేను చెబుతూనే ఉన్నా.. అభిని కలవడం మంచిది కాదని.. ఇప్పుడు అనుకున్నదంతా జరిగింది.. అంటాడు నందు. అసలు.. ఏం జరిగింది.. అని అడుగుతాడు నందు. దీంతో డబ్బు కోసం గొడవ జరిగిందట. కానీ.. తను మాత్రం చంపాలని అనుకోలేదని చెప్పాడు అంటుంది తులసి.
దీంతో అంకిత వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాకు అభి కావాలి అంటుంది అంకిత. మరోవైపు బెయిల్ పేపర్లు తీసుకొని తులసి స్టేషన్ కు వెళ్తుంది. అసలు అభిని అరెస్ట్ చేస్తే కదా అని అంటాడు పోలీస్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.