Intinti Gruhalakshmi 19 Oct Today Episode : తులసి నిలయం మళ్లీ తులసికే దక్కిందా? ఈ విషయం తెలిసి నందు ఏం చేస్తాడు? ఆ ఇంటికి తులసి వెళ్తుందా?

Authored By Varun G | The Telugu News | Published on: October 19, 2022, 9:00 am

Intinti Gruhalakshmi 19 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 అక్టోబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 767 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్యను జాబ్ లో నుంచి తీసేశాక.. ఇక లాస్య తనలోని మరో మనిషి బయటికి వస్తుంది. శభాష్.. ఇద్దరూ భలే నాటకాలు ఆడుతున్నారు. నువ్వు ఎందుకు నామీద జాలి చూపించావో… జాబ్ వచ్చేలా చూశావో నాకు ఇప్పుడు అర్థం అయింది. ఈ జాబ్ వల్ల నన్ను, నందు మీద పెత్తనం చేయాలనుకున్నావు. మరోవైపు సామ్రాట్ దృష్టిలో నువ్వు గొప్ప త్యాగం చేసినదానివి అయ్యావు.. వావ్ సూపర్ అంటుంది లాస్య. నందు చెప్పింది నిజమే నువ్వు నిజంగానే తులసి చేతిలో కీలుబొమ్మవు అంటుంది లాస్య. బిజినెస్ అనే మాట స్పెల్లింగ్ అనే కూడా తెలియని దాన్ని నీ బాస్ ఇంత పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇవ్వడం.

intinti gruhalakshmi 19 october 2022 full episode

intinti gruhalakshmi 19 october 2022 full episode

ఏదో ఒక  రోజు నువ్వు ఈ కంపెనీని నిలువునా ముంచేస్తావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య. ఆ తర్వాత ఉద్యోగులు అందరూ ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతారు. తులసికి ఏం చేయాలో అర్థం కాదు. ఈ లాస్య ఇక నుంచి ప్రశాంతంగా ఉండదు. మనల్ని ఉండనివ్వదు అంటాడు సామ్రాట్. దీంతో నాకు తెలుసు సామ్రాట్ గారు. ఇంటి దగ్గర ఇంకెంత గొడవ చేస్తుందో అంటుంది తులసి. కట్ చేస్తే ఇంట్లో పరందామయ్య, దివ్య ఇద్దరూ కలిసి చెస్ ఆడుతుంటారు. ఏనుగు అంటే గుర్తొచ్చింది మీ నానమ్మ ఏది కనిపించడం లేదు అంటాడు పరందామయ్య. ఇంతలో ప్రేమ్ స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తాడు.

దాన్ని దాచి మరీ వెళ్తుండగా ఏంటి అది అని అడుగుతాడు. ఎవరికిరా అది దొంగతనంగా తీసుకెళ్తున్నావు అంటాడు. ముసలి తాత కోసం ఎప్పుడైనా చిన్న స్వీటు ముక్క అయినా తీసుకొచ్చి ఇచ్చావా అంటాడు పరందామయ్య.

అన్నయ్యలు మారిపోయారు. వదినల కొంగులు పట్టుకొని తిరుగుతున్నారు అంటుంది దివ్య. ఇంతలో అంకిత, శృతి వచ్చి దివ్య చెవులు పిండుతారు. ఇంతలో దీనంగా ఇంటికి వస్తుంది తులసి.

Intinti Gruhalakshmi 19 Oct Today Episode : సామ్రాట్, తులసిపై లాస్య సీరియస్

తులసి ఏంటి అలా ఉందని అనుకుంటారు అందరూ. ఏమైంది అమ్మ.. ఎందుకు అలా సీరియస్ గా ఉన్నావు ఏం జరిగింది అని అడుగుతాడు ప్రేమ్. దీంతో నన్ను అడగరా.. నేను చెబుతాను అంటుంది అనసూయ.

దసరా పండుగ నాడు సామ్రాట్ ను అన్నామని.. ఒక్కొక్కరి మీద ప్రతీకారం తీర్చుకుంటోంది. నిన్న నందు, ఇవాళ లాస్య. తులసి మారిపోయింది. ఇప్పుడు ఉన్న తులసి మన తులసి కాదండి అంటుంది అనసూయ.

దీంతో అత్తయ్య ఎందుకు ఇలా నిందలు వేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేశాను అని అడుగుతుంది తులసి. నందు, లాస్య ఉద్యోగాలు పోవడానికి కారణం ఎవరు అని అడుగుతుంది అనసూయ.

సామ్రాట్ ను అడ్డం పెట్టుకొని పగ సాధిస్తున్నావు అంటుంది అనసూయ. దీంతో నాకు ఎవరి మీద కోపం లేదు అత్తయ్య అంటుంది. ఇప్పటికీ నేను పాత తులసినే. మీ తులసినే అంటుంది తులసి.

మీరే నన్ను ఒంటరి దాన్ని చేస్తున్నారు. దూరం చేస్తున్నారు. అయినా.. లాస్యను, మీ అబ్బాయిని ఆఫీసు నుంచి తప్పించడం వల్ల నాకు ఒరిగేదేంటి అంటుంది తులసి. వాళ్లు ఉంటే నీకు అడ్డం. అందుకే నువ్వు వాళ్లను తప్పించావు అంటుంది అనసూయ.

దీంతో అనసూయను తిడుతాడు పరందామయ్య. మీ అత్తయ్య అన్న మాటలు నువ్వు పట్టించుకోకు అంటాడు పరందామయ్య. అందరికీ భోజనాలు వడ్డిస్తాను రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

కోపంతో ఇంటికి వస్తుంది లాస్య. తనకు అన్నీ గుర్తొస్తాయి. ఇంట్లో వస్తువులు అని పగలగొడుతుంది. నన్ను గెటవుడ్ అంటావా.. హవ్ డేర్ యూ అంటూ ఇంట్లో చాలా కోపంగా ఉంటుంది.

ఇంతలో అక్కడికి నందు వస్తాడు. ఏమైంది లాస్య అంటాడు. నువ్వు చెప్పిందే నిజం నందు అంటుంది లాస్య. ఇద్దరిని రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు అంటుంది లాస్య. సామ్రాట్ ను మీ వాళ్లకు కూడా దగ్గర చేస్తోంది తులసి అంటుంది లాస్య.

మరోవైపు తులసి రూమ్ లో ఏదో పార్శిల్ ఉంటుంది. ఏంటి ఇది అని చూస్తుంది. దాన్ని పట్టుకొని బయటికి వస్తుంది. ఏంటి అది అని అడుగుతారు అందరూ. నాకూ అర్థం కావడం లేదు. నా రూమ్ లో ఎవరో టేబుల్ మీద పెట్టారు అంటుంది తులసి.

మరోవైపు పరందామయ్య పేపర్ చదువుతూ నవ్వుకుంటూ ఉంటాడు. ఎవ్వరిని అడిగినా ఎవ్వరూ మాది కాదు అంటారు. ఇంతలో అది నేనే పెట్టాను అంటాడు పరందామయ్య. దీంతో అందరూ షాక్ అవుతారు.

ఈ గిఫ్ట్ ఎవరి కోసం తీసుకున్నారు.. అని అడుగుతుంది తులసి. దీంతో నీకోసమే అంటాడు పరందామయ్య. ఆ తర్వాత వాళ్లు ఉన్న తులసి నిలయానికి తీసుకెళ్తాడు పరందామయ్య. అది మళ్లీ నీ చేతికి వచ్చిందంటాడు పరందామయ్య.

ఆ ఇంట్లోకి వెళ్లి చాలా సంతోషిస్తుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp