Intinti Gruhalakshmi 2 April Today Episode : ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నందు, లాస్య.. ఇక నుంచి ఇల్లు నాదీ అన్న చంద్రకళ.. అప్పు కోసం ఇంటిని తులసి చంద్రకళకు ఇచ్చేస్తుందా?

Authored By Varun G | The Telugu News | Updated on : 2 April 2022, 9:30 am

Intinti Gruhalakshmi 2 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 ఏప్రిల్ 2022, శనివారం ఎపిసోడ్ 596 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను పెద్ద ఫెయిల్యూర్. నా గురించి.. నా జీవితం గురించి ఆలోచించకుండా మీకు కట్టుబానిసలా బతికాను కదా.. అది కూడా నా ఫెయిల్యూరే.. అంటుంది తులసి. విషయాన్ని డైవర్ట్ చేస్తున్నావు తులసి అని అడుగుతుంది లాస్య. దీంతో అస్సలు కాదు. నీ భర్త తేనెతెట్టెను కదిపాడు అంటుంది తులసి. భర్తగా వీడు నీకు మర్యాద ఇవ్వనప్పుడు నువ్వు ఎందుకు అమ్మా మర్యాద ఇవ్వడం అంటుంది మాధవి. ఏ ఒక్క రోజూ ఆయన నన్ను సినిమాకు షికారుకు తీసుకెళ్లలేదు.. అంటుంది తులసి.

intinti gruhalakshmi 2 april 2022 full episode

intinti gruhalakshmi 2 april 2022 full episode

ఏ ఒక్క రోజు నన్ను మెచ్చుకున్నది లేదు. భార్యంటే ఆయన దృష్టిలో ఒక డోర్ మ్యాట్ అంటుంది తులసి. డోర్ మ్యాట్ కు అవసరాలు ఉండవు అంటుంది. నేను కిక్కురుమనలేను.. భార్యను కదా. నాకు జరిగే అవమానాల కన్నా ఆయన గౌరవమే ముఖ్యం అంటుంది తులసి. భర్తగా మీరు అతిపెద్ద ఫెయిల్యూర్ అంటుంది తులసి. ఇక తండ్రిగా మీ గొప్పదనం కూడా వింటారా.. పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ మీరు పట్టించుకోలేదు. మీ అవసరానికి మాత్రం ప్రేమ్ కు ఇష్టం లేని పెళ్లి చేయడానికి తయారయ్యారు అంటుంది తులసి.

తండ్రిగా మీరు పెద్ద ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటారా అంటుంది తులసి. పొరపాటున మామయ్య వాళ్లు మీతో వస్తే వాళ్ల ఆరోగ్యం చెడిపోతే దేవుడి మీద భారం వేసి కూర్చుంటారా? ఎవరైనా ఏదైనా అనుకుంటారు అని మీ అమ్మానాన్నను తీసుకెళ్లడం కాదు. నీకు నిజంగా బాధ్యత ఉండాలి అంటుంది తులసి.

నేను నిన్ను దూరం పెట్టినప్పటి నుంచి నువ్వు పిల్లల్లో నా మీద ద్వేషం పెంచావు. తండ్రిగా నేను ఫెయిల్యూర్ అయ్యానంటే దానికి కారణం నువ్వే. సంపాదిస్తున్నాను అనే అహంకారం నీ కళ్లలో కనిపిస్తోంది. ఇలాగే ప్రవర్తిస్తే నువ్వు దెబ్బతింటావు.. అంటాడు నందు.

మగతోడు లేని వాళ్లను సమాజం ఎలా చూస్తుందో నేను వెళ్లాక నీకు తెలుస్తుంది అంటాడు నందు. నాకు చదువు లేకున్నా నేను నా కాళ్ల మీద నేను బతుకుతున్నాను అంటుంది తులసి. కబుర్లు చెప్పడం తేలికే తులసి అంటాడు నందు.

ఎవరు వచ్చినా రాకపోయినా ప్రయాణం ఆగదు అంటుంది తులసి. నా వాళ్లు ఎవరా అని చుట్టూ చూడాల్సి వస్తుంది అంటాడు నందు. దీంతో ఖచ్చితంగా మీ వైపు మాత్రం చూడను నందగోపాల్ గారు అంటుంది తులసి. ఎలా ఉండాలో కాదు..  ఎలా ఉండకూడదో కూడా తెలుసుకున్నాను అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 2 April Today Episode : నందు, లాస్య వెళ్లిపోవడంతో వెక్కి వెక్కి ఏడ్చిన తులసి

మొత్తానికి నందు, లాస్య ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. దీంతో తులసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీంతో తనను అందరూ ఓదార్చుతారు. మరోవైపు ప్రేమ్.. ఇంట్లో ఏ గొడవ అయిందో అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో రాములమ్మ వచ్చి మీ నాన్న గారు వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు అని చెబుతుంది.

పెద్దయ్య గారి వాళ్లను తులసమ్మ పంపించలేదు అంటుంది రాములమ్మ. లాస్యమ్మ వెళ్లిపోయాక ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంది అంటుంది రాములమ్మ. దీంతో ప్రేమ్, శృతి షాక్ అవుతారు. మరి.. ఇక మీరు వెళ్లొచ్చు కదా అంటుంది రాములమ్మ.

దీంతో ఆంటి ఇప్పుడు పిలిచినా కూడా మేము అక్కడకి రాము. ప్రేమ్ కన్న కల నెరవేరితేనే అక్కడ ప్రేమ్ అడుగుపెడతాడు అంటుంది శృతి. మరోవైపు తులసికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాళ్ల పాదాలకు మొత్తం గాయాలు అయి ఉంటాయి.

అవి చూసి మాధవి బాధపడుతుంది. ఇంతలో పరందామయ్య, అనసూయ వస్తారు. వాళ్లకు విషయం చెబుతుంది మాధవి. దీంతో అనసూయ వెళ్లి తన కాళ్ల పాదాలకు ఆయింట్ మెంట్ పూస్తుంది. దీంతో తులసి చూసి.. అయ్యో అత్తయ్య ఏం చేస్తున్నారు అంటుంది.

నన్ను నీ అమ్మను అనుకో అమ్మా అంటుంది. మరోవైపు నందు, లాస్య తమ ఫ్లాట్ కు వెళ్తారు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నందు. గాల్లో తేలుతున్నట్టుగా ఉంది అంటుంది తులసి. ఇప్పటికైనా పంజరం నుంచి నన్ను బయటపడేశావు. చాలా ప్రశాంతంగా ఉంది అంటుంది లాస్య.

ఏమంటావు నందు అంటుంది లాస్య కానీ.. నందు చాలా దీనంగా కూర్చొని ఉంటాడు. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏం వినలేదు కదా అంటుంది. విన్నాను అంటాడు. మరి సమాధానం చెప్పకుండా అలా ఉన్నావు ఎందుకు అంటుంది లాస్య. ఆ తులసి అన్న మాటలు తీసుకోలేకపోతున్నా అంటాడు నందు.

ఆ తర్వాత చంద్రకళ వచ్చి ఈ ఇంటిని నా పేరు మీద రాసుకుంటాను అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి