Intinti Gruhalakshmi 2 May Today Episode : తులసి సంతోషాన్ని కాసేపట్లో తుడిచేసిన నందు.. దీంతో ప్రవళిక షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 2 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 మే 2022, సోమవారం ఎపిసోడ్ 621 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి, ప్రవళిక ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఇద్దరూ పార్క్ లో కూర్చొని కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయి. ఎవ్వరి గురించి ఆలోచించకు అంటుంది ప్రవళిక. నిజమే కానీ.. ఒక్కోసారి బంధాలు వెనక్కి లాగుతుంటాయి అంటుంది తులసి. అతిగా ప్రేమించడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని అంటుంది ప్రవళిక. తర్వాత పదా బయలుదేరుదాం అంటూ తులసిని మళ్లీ ఎక్కడికో తీసుకెళ్లబోతుంది ప్రవళిక.

intinti gruhalakshmi 2 may 2022 full episode
ఇంతలో తనకు పానీపూరీ బండి కనిపిస్తుంది. అదిగో చూడు గోల్ గప్పా అంటూ తమ చిన్ననాటి మెమోరీస్ ను గుర్తు తెచ్చుకుంటారు. ఒకసారి తిందాం పదా అంటే.. వద్దులేవే.. ఇక్కడ నిలబడి తినడం అవసరమా అంటుంది తులసి. కానీ.. నువ్వు పదా అని చెప్పి తీసుకెళ్తుంది ప్రవళిక. నీకు గుర్తుందా.. చిన్నప్పుడు మనం ఎవరు ఎక్కువ తింటారా అని పందెం కట్టుకొని మరీ తినేవాళ్లం అంటుంది ప్రవళిక. ఎందుకు గుర్తుకు లేదు. అప్పుడు ప్రతిసారి నువ్వే గెలిచేదానివి కదా అంటుంది తులసి. ఈసారి కూడా పందెం కడదామా అంటుంది ప్రవళిక. దీంతో ఎందుకు.. ఈసారి కూడా నువ్వే గెలుస్తావు అంటుంది తులసి.
Intinti Gruhalakshmi 2 May Today Episode : పందెంలో గెలిచిన తులసి
ఈ పందెం గెలిస్తే జీవితాన్నే గెలిచినట్టు అనుకో. ఈ చిన్న పందెం కూడా గెలవలేవా అంటుంది ప్రవళిక. దీంతో తులసి ఈ పందేన్ని చాలెంజింగ్ గా తీసుకుంటుంది. వెంటనే పానీపూరీ తినడం ప్రారంభిస్తుంది. ప్రవళిక కంటే ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తుంది. ప్రవళిక ఆ గేమ్ లో ఓడిపోతుంది. నేనే గెలిచాను అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది తులసి.
లైఫ్ లో గెలవడంపై నీకు చాలా పట్టుదల ఉంది అంటుంది ప్రవళిక. తులసి చాలా సంతోషిస్తుంది. కట్ చేస్తే శృతి జ్వరం వల్ల నిద్రపోతూ ఉంటుంది. ఇంతలో తనకు ఫోన్ వస్తుంది. ఎవరు శృతి యేనా మాట్లాడేది అంటుంది. ఏమైపోయావు ఈరోజు పనిలోకి రాలేదు అంటుంది.
జ్వరం వచ్చింది అంటుంది. దీంతో పనికి ఎగనామం పెట్టినప్పుడు ఎవ్వరైనా చెప్పేది ఇదే అంటుంది. రేపటి కల్లా జ్వరం తగ్గిపోతుంది. తగ్గిపోయాక నేనే వస్తాను అంటుంది శృతి. నాకు తెలియదు. రేపు వస్తేరా పనిలోకి. లేదంటే వేరేవాళ్లను పెట్టుకుంటాను అంటుంది అవుతలి వ్యక్తి.
ఇంతలో ప్రేమ్ వస్తాడు. శృతిని చూసి… పడుకోకుండా లేచి తిరుగుతున్నావేంటి.. కళ్లు తిరిగి పడిపోతే అంటాడు. డాక్టర్ ను తీసుకొని వస్తాడు. డాక్టర్ చెక్ చేసి మందులు రాసి ఇస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ మందులు తెచ్చి ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో.. నీ పనులన్నీ నేను చేస్తాను అంటాడు నందు.
మరోవైపు తులసి, ప్రవళిక ఇద్దరూ పిట్ట గోడ మీద కూర్చొని సరదాగా తింటూ ఉంటారు. సరదాగా నవ్వుతూ ఉంటారు. ఇంతలో ఇద్దరు యువకులు అక్కడి నుంచి వెళ్తూ వాళ్లను ఏదో టీజ్ చేయగా.. ప్రవళిక వాళ్లను పిలిచి వాళ్లతో డ్యాన్స్ వేయిస్తుంది.
అప్పుడే కారులో వచ్చిన నందు.. కారు ఆపి.. ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ప్రవళిక, తులసి ఉండటం చూసి తనకు కోపం వస్తుంది. వెంటనే కారు దిగి అక్కడికి రాబోతాడు. కానీ.. ఇంతలో ప్రవళిక.. తులసిని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.