Intinti Gruhalakshmi 21 Jan Today Episode : దివ్యను రూమ్ కు తీసుకెళ్లిన కార్తీక్ తనపై అఘాయిత్యం.. దివ్య బతుకును నాశనం చేస్తాడా? తులసికి ఈ విషయం తెలుస్తుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :21 January 2023,9:30 am

Intinti Gruhalakshmi 21 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి  సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జనవరి 2023, శనివారం ఎపిసోడ్ 848 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు పార్టీకి ఎక్కడికి వెళ్లిందో కనీసం అదయినా చెప్పిందా అంటే.. ఎందుకైనా మంచిది అని లోకేషన్ పెట్టింది అని చెబుతుంది. దీంతో ఆ లొకేషన్ దగ్గరికి బయలుదేరుతారు తులసి, నందు, ప్రేమ్. మరోవైపు అసలు కారును ఎక్కడికి తీసుకెళ్తున్నారు. మా ఇంటికే తీసుకెళ్తున్నారా అని అడుగుతుంది. దీంతో మీ ఇంటికే కారును తీసుకెళ్తున్నాం అంటాడు తన ఫ్రెండ్. మళ్లీ రూట్ మార్చడంతో అసలు మీరు మా ఇంటికే కారు తీసుకెళ్తున్నారా? అని అంటుంది. తనకు డౌట్ వచ్చి కారు ఆపు అంటుంది. దీంతో మనం ఫ్రెండ్స్ కదా. ఎంజాయ్ చేద్దాం. కాసేపు అలా బయట తిరుగుదాం అంటాడు. దీంతో నన్ను చీట్ చేస్తున్నారా.. కారు ఆపండి.. హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తుంది దివ్య. దీంతో తన నోరు మూస్తాడు తన ఫ్రెండ్.

intinti gruhalakshmi 21 january 2023 saturday full episode

intinti gruhalakshmi 21 january 2023 saturday full episode

ఇంతలో తులసి, ప్రేమ్.. దివ్య పార్టీ జరిగిన ప్లేస్ కు వస్తారు. ఇక్కడ ఏదైనా పార్టీ జరిగిందా అని అడుగుతారు. దీంతో అవును జరిగింది అంటాడు వాచ్ మెన్. దీంతో ఈ అమ్మాయిని చూశారా అంటే.. చూశాను సార్.. అందరు వెళ్లాక ఈ అమ్మాయి వెళ్లింది. కాస్త మత్తుగానూ ఉంది. ఇద్దరు అబ్బాయిలు దివ్యను కారులో తీసుకెళ్లారు అంటాడు. దీంతో ఆ అబ్బాయిలు ఎవరో తెలుసా? కారు నెంబర్ అయినా చూశావా అంటే చూడలేదు అంటాడు. ఇంతలో నందు వస్తాడు. ఏమైంది అంటే అంతా చెబుతారు. పదరా వెతుకుదాం అంటుంది తులసి. దీంతో ఎక్కడని వెతుకుతాం అంటాడు ప్రేమ్. పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇద్దాం అంటాడు ప్రేమ్. దీంతో వద్దు అంటుంది. తలో వైపు వెళ్లి దివ్య గురించి వెతుకుదాం పదండి అంటాడు నందు.

మరోవైపు కారులో హెల్ప్ అంటూ అరుస్తుంది దివ్య. దీంతో అరవకు.. నిన్ను మీ ఇంటి దగ్గర దింపాలి అంతే కదా.. సరదాగా ఫ్రెండ్ షిప్ తో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఇష్టం లేకపోతే వద్దులే అంటాడు తన ఫ్రెండ్. దివ్య వాళ్ల ఇంటి దగ్గరికి కారును తీసుకెళ్లు అంటాడు కార్తీక్.

వచ్చేసిందా మా ఇల్లు అంటుంది దివ్య. దీంతో కనిపిస్తోంది కనిపిస్తోంది అంటాడు కార్తీక్. మరోవైపు ఇంట్లో కూడా అందరూ టెన్షన్ పడుతూ కూర్చొంటారు. ఏడవకు అనసూయ అంటాడు పరందామయ్య.

నాకెందుకో భయంగా ఉంది అంటుంది అనసూయ. ఇన్ని సార్లు ఫోన్ చేశాం. కనీసం క్షేమంగానే ఉన్నాను అని ఎవరికైనా మెసేజ్ అయినా పెట్టాలి కదా అంటుంది అనసూయ. ఎందుకు టెన్షన్ పడుతున్నారు.. దివ్య వెళ్లింది బర్త్ డే పార్టీకే కదా అంటుంది లాస్య.

దివ్య వాళ్లతోనే ఉండొచ్చు.. వెంటనే నందుకు ఫోన్ చేస్తా ఆగు అని లాస్య.. వెంటనే నందుకు ఫోన్ చేస్తుంది. దివ్య మీతోనే ఉంది కదా అంటుంది లాస్య. దీంతో దివ్య మాతో లేదు. ఎవరో ఇద్దరు కుర్రాళ్లు తనను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారట అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.

Intinti Gruhalakshmi 21 Jan Today Episode : తన పోలీస్ ఫ్రెండ్ రామారావుకు ఫోన్ చేసిన నందు

దీంతో పోలీస్ కంప్లయింట్ ఇవ్వొచ్చు కదా అంటే వద్దు అని తులసి చెప్పింది అంటాడు. దీంతో నీ ఫ్రెండ్ రామారావు ఉన్నారు కదా. ఆయన పోలీసే కదా అంటుంది. దీంతో తన ఫ్రెండ్ రామారావుకు ఫోన్ చేసి విషయం చెబుతాడు.

దీంతో అవునా.. నువ్వు అక్కడే ఉండు. వస్తున్నా అంటాడు. మరోవైపు తనను వాళ్ల రూమ్ కు తీసుకొస్తారు కార్తీక్, తన ఫ్రెండ్. పిచ్చి దానిలా ఏడుపు ఏంటి దివ్య. అస్సలు బాగోలేదు. నువ్వు ఇంకా బావిలో కప్పలా ఉన్నవు. మారాలి అంటాడు కార్తీక్.

చూడు.. అరిస్తే నష్టం మాకే కాదు. నీకు కూడా. నీ పరువు కూడా పోతుంది. పర్లేదా? చిన్న విషయాన్ని అరిచి గగ్గోలు పెట్టి పెద్ద చేస్తున్నావు అంటాడు కార్తీక్. అరేయ్ కార్తీక్.. తప్పు చేస్తున్నాం అనిపిస్తోందిరా. దివ్యను వదిలేద్దాంరా అంటాడు తన ఫ్రెండ్.

దీంతో ఏంట్రా వదిలేది. ఇంత కష్టపడి ప్లాన్ చేసింది వదలడానికి కాదు అంటాడు కార్తీక్. ప్లీజ్ కార్తీక్.. నీ దండం పెడతాను. నీ కాళ్లు పట్టుకుంటాను. నా జోలికి రావద్దు అంటుంది దివ్య. మరోవైపు ఎక్కడ వెతికినా దివ్య కనిపించదు.

ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అమ్మకు అబద్ధం చెప్పి మోసపోయింది అంటుంది తులసి. ఇంతలో శృతి ఫోన్ చేస్తుంది. దివ్య గురించి ఏమైనా తెలిసిందా అంటే లేదు వెతుకుతున్నాం అంటాడు ప్రేమ్.

దివ్య ఫోన్ ను బట్టి తను ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు కదా అని తులసికి ఐడియా వస్తుంది. జీపీఎస్ యాప్ ఉంటుంది కదా అంటుంది. దీంతో టైమ్ కు భలే గుర్తు చేశావు అమ్మా. మొన్నే దివ్య జీపీఎస్ యాప్ డౌన్ లోడ్ చేసింది. నా మొబైల్ నుంచి జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయొచ్చు అంటాడు.

వెంటనే తన మొబైల్ తీసి దివ్య మొబైల్ ను ట్రాక్ చేస్తాడు ప్రేమ్. వెంటనే ఇద్దరూ బయలుదేరుతారు. మరోవైపు కార్తీక్.. మందు తాగుతూ దివ్యను బెదిరిస్తుంటాడు. తను మందు తాగుతుంటే మెల్లగా తప్పించుకోవాలని చూస్తుంది దివ్య.

దీంతో తనను పట్టుకొని దివ్య.. నా మూడ్ డిస్టర్బ్ చేయకు అంటాడు కార్తీక్. పదా.. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అంటాడు కార్తీక్. బేబీ నీకు ఒక మాట చెప్పనా.. గత 6 నెలలుగా నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటాడు.

లవ్ చేసింది పెళ్లి చేసుకోవడానికి కాదు అంటాడు. ఒరేయ్ కార్తీక్.. వద్దురా వెళ్లిపోదాంరా అంటాడు. దీంతో నువ్వు వెళ్లి బయట కాపలా ఉండుపో అంటాడు. మనం కూడా వెళ్లిపోదాం అంటే వినడు. తనపై అఘాయిత్యం చేయబోతాడు. ఇంతలో అక్కడికి ప్రేమ్, తులసి వస్తారు. వాళ్లను చూసి కార్తీక్ ఫ్రెండ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి